మా అమ్మ బ‌తికుంటే బాగుండేది: ఏడ్చేసిన శ్వేత | Bigg Boss Telugu 5: Swetha, Siri Gets Emotional | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: నాకు క్యారెక్ట‌ర్ లేదు, ఫ్రెండ్‌షిప్ చేయ‌కండి: సిరి క‌న్నీటి ప‌ర్యంతం

Published Fri, Oct 15 2021 11:51 PM | Last Updated on Sun, Oct 17 2021 3:12 PM

Bigg Boss Telugu 5: Swetha, Siri Gets Emotional - Sakshi

Bigg Boss Telugu 5, Episode 41: అంద‌రూ క‌లిసి త‌న‌ను మ‌రోసారి వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్ చేస్తారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశాడు స‌న్నీ. అయితే మాట వ‌ర‌స‌కు కూడా ఆ మాట న‌చ్చ‌ని మాన‌స్‌, కాజ‌ల్‌.. అదే క‌న‌క జ‌రిగితే హౌస్‌మేట్స్‌తో తాము ఫైట్ చేస్తామ‌ని ముందుకొచ్చారు. ఏదేమైనా సిరి మాత్రం త‌న‌ను వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా చెప్ప‌డం గ్యారెంటీ అని బ‌ల్ల‌గుద్ది చెప్పాడు స‌న్నీ. అతిగా ఆశ‌ప‌డే ఆడ‌ది, అతిగా ఆవేశ‌ప‌డే మ‌గాడు సుఖ‌ప‌డిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదు అని ర‌జనీకాంత్ ఆనాడే చెప్పాడు.. అందుకే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

రాత్రివ‌ర‌కు మాన‌స్‌తో మాట్లాడ‌కూడ‌దు
త‌ర్వాత కిచెన్‌లో ముస‌లం మొద‌లైంది. 'బియ్యం ఉడుకుతుంటే స‌గంలోనే దాన్ని ప‌క్క‌న పెట్టేసి వేడినీళ్లు పెట్టుకున్నారు. మ‌ళ్లీ రైస్‌కుక్క‌ర్ ఆన్ చేయ‌నేలేదు' అని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది ప్రియ‌. దీంతో నాలుక్క‌రుచుకున్న శ్వేత‌.. ఆమె చెప్పే టోన్ న‌చ్చ‌లేదని నిప్పులు చెరిగింది. అన్నింటికి రియాక్ట్ అయితే తాను కూడా రియాక్ట్ అవుతాన‌ని ఫైర్ అయింది. ప్రియాంక మైక్ వేసుకోవ‌డం మ‌ర్చిపోవ‌డంతో కెప్టెన్ విశ్వ‌ ఆమె ఈ రోజు రాత్రివ‌ర‌కు మాన‌స్‌తో మాట్లాడ‌కూడ‌ద‌ని శిక్ష విధించాడు. అయిష్టంగానే ఈ శిక్ష‌ను అంగీక‌రించిన పింకీ మాన‌స్‌తో సైగ‌ల ద్వారా మాట్లాడింది.

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో స‌త్తా చాటిన కాజ‌ల్‌, లోబో, విశ్వ‌, ర‌వి
'ప‌గ‌ల‌గొట్టిన‌వారిదే పండ‌గ'; అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కులో భాగంగా ప‌లు గేమ్స్ ఆడించాడు. అయితే ష‌ణ్ముఖ్‌.. ఆట మొద‌ల‌వ‌క‌ముందే డ్రాప్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చాడు. కానీ త‌ర్వాత మాత్రం ఆట ఆడ‌క త‌ప్ప‌లేదు. యాపిల్స్‌తో ట‌వ‌ర్ కట్టే టాస్కులో శ్వేత ప్రియాంకను ఓడించ‌గా ఆమె ప‌గ‌ల‌గొట్టిన కుండ‌లో మ‌ట‌న్ వ‌చ్చింది. గోటీలను స్కేలుకు ఒక‌వైపు నుంచి మ‌రోవైపుకు చేర్చే గేమ్‌లో కాజ‌ల్ ప్రియ‌ను ఓడించింది. ఆమె ప‌గ‌ల‌గొట్టిన పిగ్గీ బ్యాంక్‌లో ర‌వ్వ అనే ఐట‌మ్‌ ఉంది. చాప్‌స్టిక్స్‌తో బాల్స్ గీత‌కు అవ‌త‌ల వేయాల‌న్న గేమ్‌లో లోబో, యానీ పాల్గొన‌గా.. లోబో గెలిచి కుండ ప‌గ‌ల‌గొట్టగా అందులో ప‌న్నీర్ ఉన్న‌ట్లు తేలింది. స్ట్రాతో జెమ్స్ ప్లేటులో వేయాల్సిన గేమ్‌లో ర‌వి గెల‌వ‌గా అత‌డు ప‌గ‌ల‌గొట్టిన కుండ‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న‌ట్లు తేలింది. ముక్కుతో దూది తీయాల్సిన గేమ్‌లో ష‌ణ్నును ఓడించి విశ్వ గెలిచాడు. అత‌డు ప‌గ‌ల‌గొట్టిన పిగ్గీబ్యాంక్‌లో కాఫీ వ‌చ్చింది.

అడిగి మ‌రీ ప్ర‌పోజ్ చేయించుకుంటున్న పింకీ
నాకు క్యారెక్ట‌ర్ లేదుక‌దా, మ‌రెందుకు ఫ్రెండ్‌షిప్ చేయ‌డం? చేయ‌కండి! అని అల‌క‌బూనింది సిరి. నిన్ను ఉడికిద్దామ‌నే ష‌ణ్ను అలా అన్నాడు, అంతేనంటూ ఆమెను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశాడు జెస్సీ. నా బ్రెయిన్‌ను డిస్ట‌ర్బ్ చేద్దాం అనుకుంటున్నారా? అని హ‌ర్ట్ అయింది సిరి. వేరేవాళ్ల‌తో పోల్చి మాట్లాడితే బాధ‌గా ఉంటుంద‌ని చెప్పింది. ఇంత‌లో ప్రియాంక వ‌చ్చి నాకు ప్ర‌పోజ్ చేయాల్సివ‌స్తే ఎలా చేస్తావు? అని జెస్సీని అడిగింది. అత‌డు నిర్మొహ‌మాటంగా నేను చెయ్య‌ను అని తేల్చి చెప్పాడు. ఒక‌వేళ చెయ్యాల్సి వ‌స్తే స‌చ్చిపోతాడు, కానీ చెయ్య‌డు అని కౌంట‌రిచ్చాడు ష‌ణ్ను. దీంతో రూటు మార్చిన పింకీ.. త‌న‌ను సిరి అనుకుని ప్ర‌పోజ్ చేయ‌మంది. చేస్తే సిరికే చేస్తానంటూ పంచ్ ఇచ్చాడు జెస్సీ. ఇది విన్న ష‌ణ్ను.. ఆమె నీకు ఏ యాంగిల్‌లో న‌చ్చిందిరా అంటూ జోకేయ‌డంతో సిరి ఏడ్చేసింది.

త‌ప్పొక‌రిది, అందులో భాగ‌మైనందుకు శిక్ష మరొక‌రిది
ఈ వారం వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంద‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎవ‌రిని జైలుకు పంపాల‌నుకుంటున్నారో వారి టీ ష‌ర్ట్ మీద స్టాంప్ వేయాల్సి ఉంటుంద‌న్నాడు. మొద‌ట‌గా విశ్వ.. కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో ర‌వి.. బిగ్‌బాస్ ప్రాప‌ర్టీని ధ్వంసం చేయాల‌న్న ఐడియా న‌చ్చ‌లేదంటూ అత‌డిని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా ఎన్నుకున్నాడు. ప్రియాంక సింగ్‌, ప్రియ‌, ష‌ణ్ముఖ్‌, లోబో.. బిగ్‌బాస్ ప్రాప‌ర్టీని ధ్వంసం చేసిన శ్వేత‌ను వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా ఎన్నుకున్నారు. స‌న్నీ, మాన‌స్‌.. సిరిని; శ్రీరామ్‌, సిరి.. యానీ మాస్ట‌ర్‌ను వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్ అని చెప్పారు. ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడంటూ లోబోను వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా ఎన్నుకుంది యానీ. శ్వేత, జెస్సీ కూడా లోబోనే వ‌ర‌స్ట్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. జెస్సీ ఈ వారం క‌న‌ప‌డ‌లేదంటూ మ‌రోసారి అత‌డిని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా ఎన్నుకున్నాడు ర‌వి. మెజారిటీ ఓట్లు శ్వేత‌కు ప‌డ‌టంతో ఆమెను జైలుకు పంపించారు.

ర‌వి ఫేస్ చూసి మోక‌పోకు: మాన‌స్‌
ర‌విని క్ష‌మించ‌లేక‌పోతున్నాన‌ని మాన‌స్‌తో చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. ఫేస్ చూసి మోస‌పోక‌ని, సింప‌తీగా ఫేస్ పెడితే న‌మ్మేయ‌క‌ని నొక్కి చెప్పాడు మాన‌స్‌. ర‌వి ఫేక్‌గా ఉంటున్నాడు కాబ‌ట్టే క్ష‌మించ‌లేక‌పోతున్నానంది కాజ‌ల్‌. మ‌రోప‌క్క‌ ర‌వి ఐడియాకు తాను బ‌ల‌య్యాన‌ని జైలులో ఏడ్చేసింది శ్వేత‌. దీంతో యానీ మాస్ట‌ర్ ఆమెను ఓదార్చింది. ఇక‌ అర్ధ‌రాత్రి అవుతున్నా శ్వేత నిద్ర‌పోక‌పోవ‌డంతో యానీ కూడా జాగారం చేసింది.

రవి వ‌ల్లే నీకీ దుస్థితి: షణ్ముఖ్‌
త‌ర్వాత‌ ష‌ణ్ముఖ్ శ్వేత‌తో ఆమెకు ఈ ప‌రిస్థితి రావ‌డానికి గ‌ల‌ కార‌ణాన్ని చ‌ర్చించాడు. ర‌వి మీతో చేయించాడు కానీ అత‌డు చేయ‌లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశాడు. త‌ర్వాత శ్వేత‌కు, యానీ మాస్ట‌ర్‌కు జ‌రిగిన గొడ‌వ గురించి ప్ర‌స్తావిస్తూ.. అందులో యానీ త‌ప్పే ఉంద‌న్నాడు. త‌న‌కు ఏ రిలేష‌న్స్ వ‌ద్దంటూ ఆమె నోరు జారింద‌ని చెప్ప‌డంతో శ్వేత క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. మా అమ్మ బ‌తికుంటే బాగుండేద‌ని వెక్కి వెక్కి ఏడ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement