
సంచాలకులు తప్పు చేస్తే బిగ్‌బాస్ అనర్హత వేటు వేస్తాడని ఇంటిసభ్యులకు క్లారిటీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. కూతురు మీద, వాళ్ల మీద, వీళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకని యానీ మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. నామినేషన్స్‌లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగ్. యాక్టర్స్ అంటూ చిన్నచూపా? అని నిలదీశాడు. దీంతో శ్రీరామ్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. హౌస్ ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదన్న నియమం తెలియదా? అని లోబోను ప్రశ్నించాడు నాగ్. రవి చెప్తేనే అలా చేశానని అతడు సమాధానమివ్వడంతో రవి గడ్డి తినమంటే తింటావా? అని నిందించాడు హోస్ట్.
అసలు ఈ ఐడియా ఇచ్చిన రవిని నిలదీశాడు నాగ్. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. శ్వేత కూడా కుషన్స్ కట్ చేస్తుందన్న విషయం తనకు తెలియదని చెప్తుండగా మధ్యలోనే అడ్డుకుంది శ్వేత. నేను కూడా తన ఐడియానే ఫాలో అవుతున్నానన్న విషయం రవికి తెలుసు అని చెప్పింది. దీంతో నాగ్.. ఇవన్నీ వింటుంటే నటరాజ్ మాస్టర్ చెప్పిందే నిజమనిపిస్తుందని అతడిని పరోక్షంగా గుంటనక్క అని పిలిచాడు నాగ్. దీంతో రవి సిగ్గుతో తల దించుకున్నాడు. ఈ గొడవలో నుంచి రవి ఎలా బయటపడతాడు? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment