
అందరూ కలిసి చేసుకునేదే పండగ. కానీ ఈ పండక్కి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అక్కడున్నవాళ్లతోనే వేడుకలు జరుపుకునే అవకాశం ఉంది తప్ప వారివారి ఫ్యామిలీని కలుసుకునే, చూసుకునే ఛాన్సే లేదు. కానీ పండగ రోజు వారి మనసు కష్టపెట్టడం తగదనుకున్నాడో ఏమోకానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన వీడియోలు చూపించి హౌస్‌మేట్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. దాదాపు నెల రోజులుగా ఇంట్లోవాళ్లను చూడకుండా ఉన్న కంటెస్టెంట్లు వారి మాటలు వినగానే ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదిలా వుంటే నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన హైపర్ ఆది ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్ చేస్తూ నవ్వించాడు. శ్వేతతో పులిహోర కలపడం వచ్చుగానీ చపాతీ పిండి కలపడం రాదా? అని సెటైర్ వేశాడు. నేను టైటిల్ వెంట పడుతుంటే పింకీ నా వెంట పడుతుందేంటి? అని అనిపించిందా? అని మానస్‌ను గుచ్చిగుచ్చి అడిగాడు. కాజల్‌ను నిద్రలో నుంచి లేపి పేరేంటి? అని అడిగితే స్ట్రాటజీ అంటుందని ఆమెమీద పంచ్ వేయడంతో అందరూ ఘొల్లున నవ్వారు. ఇక నాగ్ కూడా రవిని.. ఏంటి, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తావా? అంటూ ఆటపట్టించడం గమనార్హం. ఆటలు, పాటలు, ఆనందాలు, కన్నీళ్లు.. అన్నింటి కలయికగా వస్తున్న నేటి ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు.