
తెలుగు బుల్లితెర మీద దమ్మున్న మేల్ యాంకర్లలో రవి ఒకరు. పంచ్‌లతో, కామెడీతో, యాక్టింగ్‌తో అటు అభిమానులు, ఇటు ఆడియన్స్ ఇద్దరినీ ఎంటర్‌టైన్ చేయడంలో యాంకర్ రవి దిట్ట. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై తన ప్రస్థానం కొనసాగిస్తున్న రవి ఈ మధ్యే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో అడుగు పెట్టాడు. ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్న అతడి బర్త్‌డే నేడు(సెప్టెంబర్ 19).
ఈ సందర్భంగా రవి ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ బిగ్‌బాస్ హౌస్ బయట రచ్చరచ్చ చేశారు. పటాసులు పేలుస్తూ రవికి వినబడేలా గట్టిగా అరుస్తూ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలో రవి కూతురు వియా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ బెలూన్లు గాల్లో వదిలింది. అనంతరం తండ్రిని గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోపక్క యాంకర్ రవికి బిగ్‌బాస్ బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ పంపిన లెటర్, గిఫ్ట్‌ను అతడికి అందించనున్నట్లు సమాచారం. ఇక హౌస్‌లో రవి బర్త్‌డే సెలబ్రేషన్స్ చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment