
Bigg Boss 5 Telugu, Anchor Ravi: స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి టాప్ 5కి వెళ్లడం ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో రవిని చాలావరకు నెగెటివ్‌గానే చూపించారు. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడటం, అందరికీ సలహాలు ఇవ్వడం లాంటి చేష్టలను నెగెటివ్‌గానే చూపించాడు బిగ్‌బాస్. దీంతో అతడికి గుంటనక్క, ఇన్‌ఫ్లూయెన్సర్, నారదుడు అని రకరకాల పేర్లు పెట్టారు. అయినప్పటికీ రవి తన సహనం కోల్పోకుండానే మాట్లాడుతూ గేమ్ ఆడాడు. లహరి విషయంలోనూ అతడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు.
హౌస్‌మేట్స్ అతడిని నమ్మాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే స్థితికి చేరుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భార్య నిత్య, కూతురు వియా రావడంతో అతడి మీదున్న నెగెటివిటీ ఒక్కసారిగా హుష్‌కాకి అయింది. రవి మీద పాజిటివిటీ పెరిగింది. కానీ అదే వారం బిగ్‌బాస్ అతడికి హౌస్‌లో ఆఖరి వారం చేసి పంపించేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలతో బిజీగా మారాడీ యాంకర్. తాజాగా అతడి ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నేను నచ్చలేకపోతే నన్ను తిట్టండి, ఏమైనా అనండి.. కానీ నా ఫ్యామిలీ జోలికి రావద్దు. సోషల్ మీడియాలో చెత్త నా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇలాగైతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాను'
'గతంలో నాకో నమ్మకద్రోహం జరిగింది. అన్నా బిజినెస్ పెట్టాలి, మా పరిస్థితి అంత బాగోలేదు అని ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు రెండు సంవత్సరాల పాటు నాతోనే ఉన్నాడు. అతడికి మందు అలవాటు లేదు, రోజూ గుడికి వెళ్తాడు, నమ్మకస్తుడు.. అందుకని ఏం ఆలోచించకుండా వెంటనే రూ.45 లక్షలు ఇచ్చాను. 20 రోజుల్లో తిరిగిస్తా అన్నవాడు ఇప్పటికీ ఇవ్వలేదు. నా వల్ల ఒకడు బాగుడపతాడు కదా అని లెక్కపత్రం కూడా తీసుకోకుండా డబ్బిచ్చాను, కానీ అతడు మోసం చేశాడు. అది చాలా ఎక్కువ మొత్తం కావడంతో నా భార్య ఉపవాసాలు, పూజలు చేసింది. ఆ డబ్బు తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుకున్నాను' అని చెప్పుకొచ్చాడు రవి.
Comments
Please login to add a commentAdd a comment