
హౌస్‌మేట్స్ టాప్ 5పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా కప్పు కొట్టాలని ఫిక్సయ్యారు. కానీ టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్‌ను పంపించివేశారట!
Bigg Boss 5 Telugu, 12th Week Elimination: రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలయ్యాయి.. బిగ్‌బాస్ ప్రయాణం ముగింపునకు చేరుకుంటోంది. చివరి మజిలీకి చేరుకున్న హౌస్‌మేట్స్ ఎవరికి వారు టాప్ 5పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా కప్పు కొట్టాలని ఫిక్సయ్యారు. కానీ మరికొందరు మాత్రం ఈ వారమే వెళ్లిపోతామేమోనన్న భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
ఈ 12వ వారం మానస్ మినహా మిగతా ఏడుగురు ఇంటిసభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా షణ్ను, సన్నీ, శ్రీరామ్, రవి ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కుతారని అంతా అనుకున్నారు. మిగిలిన కాజల్, ప్రియాంక, సిరిలలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదని అంచనా వేశారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం అమ్మాయిల్లోనుంచి ఒకరు కాకుండా టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్‌ను పంపించివేశారట!
యాంకర్ రవిని ఎలిమినేట్ చేసినట్లు లీకువీరులు నెట్టింట టముకేసి మరీ చెప్తున్నారు. ఈ వార్త విని రవి ఫ్యాన్స్ షాకవుతున్నారు. రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్‌కు ఎక్కువ ఓట్లు రావడం నమ్మశక్యంగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే రవి ఎలిమినేట్ అయ్యాడా? లేదా కావాలని పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.