
ఆమె తాగిన ప్లాస్టిక్ టీ కప్పులు, వాడిన టిష్యూ పేపర్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. కానీ ఆమెకు పెళ్లైపోయింది, కొడుకు పుట్టాడు.. లోబో
Bigg Boss Telugu 5, Episode 19: ప్రియ నెక్లెస్ దొంగిలించాలన్న సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకుగానూ యాంకర్ రవి కెప్టెన్సీకి పోటీపడేందుకు అర్హత సాధించాడు. ఈ వారం కెప్టెన్సీకి ఎవరెవరు పోటీపడతారో మీరే తేల్చుకుని చెప్పండని బిగ్‌బాస్ కంటెస్టెంట్ల నిర్ణయానికే వదిలేశాడు. దీంతో జెస్సీ, రవి, శ్వేత, శ్రీరామచంద్ర కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే లహరి కూడా కెప్టెన్సీకి ట్రై చేస్తానని అన్నప్పటికీ ఆమెకెవరూ సపోర్ట్ చేయకపోవడంతో బాగా హర్ట్ అయింది.
షణ్ముఖ్ దూరం పెడుతున్నాడంటూ ఏడ్చేసిన సిరి
మరోపక్క షణ్ముఖ్ మాట్లాడట్లేదని సిరి హర్ట్ అయింది. ప్లీజ్ మాట్లాడరా.. అంటూ అతడి వెనకాల పడింది. అయినప్పటికీ ఏమాత్రం చలించిన షణ్ను నీతో ఫ్రెండ్‌షిప్ కూడా ఇంట్రస్ట్ లేదని ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ముఖం మాడ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. 'షణ్ను 24 గంటలు శ్వేతతో ఉంటున్నాడు, నేనేమైనా అంటున్నానా? నాకు స్పేస్ ఇవ్వట్లేదు, దూరం పెడుతున్నాడు' అంటూ కాజల్ దగ్గర ఏడ్చేసింది సిరి. అయితే వీళ్లిద్దరినీ కలిపేందుకు జెస్సీ విశ్వ ప్రయత్నం చేశాడు.
మూడో కెప్టెన్‌గా జెస్సీ
తర్వాత కెప్టెన్సీ టాస్క్ 'స్విమ్ జర స్విమ్' టాస్క్ ప్రారంభం అయింది. పూల్‌లోని కెప్టెన్సీ లెటర్స్‌ను తీసుకొచ్చి కెప్టెన్ అని రాసున్న ఖాళీ స్లాట్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్కులో చాలామంది తక్కువ అంచనా వేసిన జెస్సీ గెలిచి మూడో కెప్టెన్‌గా నిలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అనంతరం అతడు తన స్నేహితుడు షణ్ముఖ్‌ను రేషన్ మేనేజర్‌గా నియమించాడు. అయితే జెస్సీ కెప్టెన్ అవగానే గ్రూపులు స్టార్ట్ అయ్యాయని లోబో పెదవి విరిచాడు.
ఫస్ట్ లవ్ ఫెయిల్: షణ్ముఖ్
తొలి ప్రేమ జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకోండంటూ బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'మరుపురాని తొలి ప్రేమ' టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీ తొలి ప్రేమ పేరు రాసి ఎందుకు ప్రత్యేకమైందో చెప్పాలని ఆదేశించాడు. మొదటగా షణ్ముఖ్ తన లవ్‌స్టోరీ రివీల్ చేస్తూ.. '8వ తరగతి నుంచి ఓ అమ్మాయంటే పిచ్చి. ఇంటర్ సెకండియర్‌లో ఆమె బర్త్‌డే రోజు ప్రేమను వెలిబుచ్చాను. కానీ ఈ ప్రేమలో ఫెయిలయ్యాను. ఆ సమయంలోనే పట్టుదలతో నటన, డ్యాన్స్ నేర్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు.
నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగాడు: యానీ మాస్టర్
విశ్వ తెలియని వయసులో పుట్టిన ప్రేమ గురించి చెప్తూ.. 'ఆరో తరగతిలో సుమలతను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఆమెకు పెళ్లైపోయిందని తెలిసింది, ఆమెకు ఒక పాప కూడా ఉంది. నా ఫస్ట్ హీరోయిన్ ఆమెనే. కానీ ఆమె చనిపోయింది' అని ఫస్ట్ లవ్ గుర్తు చేసుకున్నాడు. యానీ మాస్టర్.. 'ప్రమోద్ చాలా సింపుల్ పర్సన్. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని డైరెక్ట్‌గా అడిగాడు. మాకు పెళ్లైంది, బాబు కూడా పుట్టాడు. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు నొప్పి భరించలేకపోయాను. నాకు ఆసుపత్రిలో కాళ్లు ఒత్తుకుంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏ ఒక్కరోజూ నేను లేట్‌గా ఎందుకు వచ్చానని ప్రశ్నించలేదు, అంతలా అర్థం చేసుకున్నాడు' అంటూ ఎమోషనల్ అయింది.
మా ఫ్రెండ్ సెట్ చేయమంటే వాడిని సైడ్ చేశాను: రవి
యాంకర్ రవి ఫస్ట్ లవ్ కోసం మాట్లాడుతూ.. 'సాయిబాబా గుడిలో హారతి ఇచ్చే సమయంలో ఆమెను చూశాను, వావ్ అనిపించింది. ఆ అమ్మాయి కోసం కాలేజీలో జాయిన్ అయ్యాను. నాఫ్రెండ్ ఆ అమ్మాయితో సెట్ చేయమని అడిగితే నేను మెల్లిగా వాడిని సైడ్ చేశాను. చదువు లేకపోతే భవిష్యత్తు లేదన్న భ్రమలో ఉన్న నాకు ఏదైనా సాధించవచ్చన్న ధైర్యాన్ని నింపింది. నాలుగేళ్లు సంతోషంగా గడిపాం. మా ఇద్దరికీ పెళ్లయింది. నా భార్య నిత్యను ముద్దుగా లడ్డూ అని పిలుచుకుంటాను. లవ్ యూ' అంటూ ఆమె పేరు రాసిన బెలూన్‌ను సంతోషంగా గాల్లోకి ఎగిరేశాడు.
ఆమెకు ప్రపోజ్ చేశాను, పెళ్లి కూడా చేసుకున్నా: నటరాజ్ మాస్టర్
నటరాజ్ మాస్టర్ తన సక్సెస్‌ఫుల్ లవ్‌స్టోరీ గురించి చెప్తూ.. 'ప్రేమంటే పెద్దగా గిట్టేది కాదు. నా చుట్టూ కలర్‌ఫుల్ లైఫ్ ఉండేది, అందుకే నన్ను ప్రేమించిన అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. బేబీ, రాజు అని ముద్దుగా పిలిచేది, కానీ నేను మాత్రం లెక్క చేసేవాడిని కాదు. కానీ నన్ను పిచ్చిగా ప్రేమించిన ఆమెను ఫస్ట్ టైమ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌కు పిలిచి ప్రపోజ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను. నా భార్య లేకపోతే ఇప్పుడిలా ఇక్కడ ఉండేవాడిని కాదు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఆమె సింగిల్ అయితే మింగిల్ అవడానికి రెడీ: జెస్సీ
జెస్సీ మాట్లాడుతూ.. 'చిన్నీ, నా క్లాస్‌మేట్. సైకిల్ మీద తనను ఫాలో అయ్యేవాడిని. ఒకరోజు ఆమెను ఆపి చాక్లెట్ ఇచ్చి ఐ లవ్‌యూ చెప్పా. నవ్వుతూనే అడ్డంగా తలూపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒకసారి ఆమెకు ఫోన్ చేస్తే బ్లాక్ చేసింది. ఈ మధ్యే రెండురోజులు నాన్‌స్టాప్‌గా చాట్ చేసింది. నాకు చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్లీ బ్లాక్ చేసింది. ఇప్పటివరకు ఆమె వేలిని కూడా టచ్ చేయలేదని, ఆమె సింగిల్ అయితే తాను మింగిల్ అవడానికి రెడీ' అంటూ సిగ్నల్స్ ఇచ్చేశాడు.
హీరో అవుదామని వచ్చాడు, ఇంటికొచ్చి పెళ్లన్నాడు: ప్రియ
తర్వాత ప్రియ మాట్లాడుతూ.. 'పదో తరగతి తర్వాత ఈ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడిని కేక్ అని పిలిచేదాన్ని. ఇంజనీరింగ్ చేసిన అతడు హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు. ఒక స్టూడియోలో అనుకోకుండా తారసపడ్డాం. నన్ను ఇష్టపడి మా ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అప్పుడు మా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీంతో మా ఫ్యామిలీ బాధ్యతలు నేను తీసుకోవాలి, ఇప్పుడే పెళ్లి వద్దన్నాను. అత్తవాళ్లు ఒప్పుకోలేదు, కానీ పేరెంట్స్ ఒప్పుకుని పెళ్లి చేశారు. ఇతడు నా ఫస్ట్ లవ్, ఇప్పటికీ ప్రేమిస్తున్నా. కానీ ఆత్మగౌరవం కోల్పోతే అక్కడ ప్రేమ, ఇష్టం ఏదీ ఉన్నా దానికి విలువ లేదని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను మ్యారీడా, డివోర్స్‌డా? సెపరేటా? అన్నది నాకే తెలియని పరిస్థితిలో ఉన్నా. మాకో బుజ్జి బాబు సోనూ ఉన్నాడు' అంటూ ఎమోషనల్ అయింది.
అమ్మానాన్న అన్నం తింటుండగా పోలీసులు వచ్చారు: కాజల్
కాజల్.. 'నాది సక్సెస్‌ఫుల్ లవ్‌స్టోరీ. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకున్నాం. మా విషయం తెలిసి నన్ను వైజాగ్ పంపించేశారు. తర్వాత మళ్లీ నా పేరెంట్స్ వచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు. అప్పుడు నేను 100కు డయల్ చేసి బలవంతంగా ఇంట్లో ఉంచారని చెప్పాను. అమ్మానాన్న అన్నం తింటుండగా పోలీసులు వచ్చారు. పోలీసులు రాగానే వెంటనే వాళ్లతో వెళ్లిపోయాను. కానీ నాకు కూతురు పెట్టాక ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. వాళ్లనెంత బాధపెట్టానో.. ఇప్పుడు వాళ్లు ఇంట్లో నా పాపను, భర్తను చూసుకుంటున్నారు కాబట్టే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను' అని ఎమోషనల్ అయింది.
14 ఏళ్ల ప్రేమ, వేరొకరితో పెళ్లైంది: లోబో
తర్వాత లోబో.. 14 ఏళ్ల నిజమైన ప్రేమ మాది. ఆమె తాగిన ప్లాస్టిక్ టీ కప్పులు, వాడిన టిష్యూ పేపర్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. ఆమెకు పెళ్లైంది, కొడుకు పుట్టాడు. నాకూ పెళ్లైంది, కూతురు ఉంది. ఆమె బర్త్‌డేకు కాలిపై టాటూ వేసుకుని గిఫ్ట్ ఇచ్చాను. ఈ టాటూలో మే 22న 1.30 గంటలకు ప్రపోజ్ చేసినట్లు ఉంటుంది. ఇది నా జీవితాన్నే మార్చేసింది. ఆమెను పిలిచే ముద్దుపేరుతోనే నా కూతురిని పిలుస్తున్నాను. అయితే ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉండటానికి మాత్రం నా భార్యే కారణం' అని చెప్పుకొచ్చాడు.