
గతవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘పంథం నీదా నాదా’అనే టాస్క్ ఇచ్చి హౌస్‌మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం మాత్రం కామెడీ టాస్క్‌తో ముందుకు వచ్చాడు. కెప్టెన్సి కంటెండర్ టాస్క్‌గా ‘హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి’అనే ఫన్నీ గేమ్‌ని ఇచ్చాడు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిగా లహరి, అమెరికాగా అబ్బాయిగా శ్రీరామ చంద్ర సెలెక్ట్ అయ్యారు. ఇక అమ్మాయి మామయ్యగా రవి, అబ్బాయి మాజీ ప్రియురాలిగా హమిదాను సెలెక్ట్ చేశాడు బిగ్‌బాస్. సెలైంట్‌గా ఉన్న షణ్ముఖ్‌కు మ్యారేజ్ బ్రోకర్ క్యారెక్టర్ ఇచ్చాడు. వీరికి ఇచ్చిన రోల్స్ ను సిరి చదువుతూ ఉంటే హౌస్ లో ఉన్నవారంతా పడిపడి నవ్వారు.
(బిగ్‌బాస్: మిడ్‌నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్)
తమకు ఇచ్చిన పాత్రల్లో హౌస్‌మేట్స్ లీనమైపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతంది. మామయ్య పాత్ర అనగానే రవి గెటప్ చేంజ్ చేసుకున్నాడు. పొట్టపెంచుకొని రవి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. మరోవైపు మ్యారెజ్ బ్రోకర్ షణ్ముఖ్‌తో బేరాలాడుతున్నాడు మానస్. తనకు అమ్ము(లహరి)తో పెళ్లి కావాలని, ఎంత డబ్బులైనా తీసుకొని తన పెళ్లి జరిపించాలని కోరాడు.దీనికి లోబో ‘పది కోట్లు కావాలి ఇస్తావా’అంటూ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఇంట్లో ఇంత కామెడీ జరుగుతున్న క్రమంలో రవికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెడర్ పోటీ దారులయ్యే అవకాశాన్ని ఒక సీక్రెట్ టాస్క్ ద్వారా కల్పిస్తున్నట్లు రవికి చెప్పి బయటకు పంపించాడు. మరి రవికి ఇచ్చిన ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి? అందులో రవి గెలిచాడా లేదా? తెలియాలంటే స్టార్ మాలో నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.