
మరో ఐదు రోజులు ఈ రీయాల్టీ షోకి శుభం కార్డు పడనుంది
Bigg Boss 5 Telugu Today Promo: బుల్లి తెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో ఐదు రోజులు ఈ రీయాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. ఈ ఆదివారం(డిసెంబర్ 19) గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఐదుగురు ఉన్నారు. వారికి మధురజ్ఞాపకాలను అందిస్తున్నాడు బిగ్‌బాస్. నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీరామ్, మానస్‌ల బిగ్‌బాస్ జర్నీ చూపించి, వారిలో జోష్ నింపాడు. ఇక నేడు మిగిలిన ఇంటి సభ్యులై జర్నీ చూపించినట్లు తెలుస్తోంది. వాళ్లు గేమ్ ఎలా ఆడారు? బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల ప్రయాణం ఎలా జరిగింది? తదితర విషయాల్ని వీడియో రూపంలో వారికి చూపించాడు. ఈ క్రమంలో షణ్ముఖ్ ఆనందంతో చిందులేశాడు. ‘ఎంత మంది మిమ్మల్ని నామినేట్ చేసినా అధైర్య పడకుండా ఆటను ఫినాలే వరకూ తీసుకొచ్చారు’అంటూ బిగ్‌బాస్ షణ్ముఖ్‌పై ప్రశంసలు కురిపించాడు.