షణ్ను మీద ప్రతీకారం తీర్చుకున్న రవి! | Bigg Boss Telugu 5: Its Time For Solid Payback, Ravi Revenge On Shanmukh | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu 5: నాగ్‌ ప్రోత్సాహంతో షణ్ను మీద ప్రతీకారం తీర్చుకున్న రవి!

Published Sat, Nov 6 2021 6:25 PM | Last Updated on Sat, Nov 6 2021 6:56 PM

Bigg Boss Telugu 5: Its Time For Solid Payback, Ravi Revenge On Shanmukh - Sakshi

కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో రవి కష్టాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాడు. నీకు నరకం అంటే ఏంటో చూపించారు కదా! ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు నాగ్‌..

ప్రతివారం యాంకర్‌ రవి మీద విరుచుకుపడే నాగార్జున ఈసారి మాత్రం అతడిని మెచ్చుకున్నాడు. కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో రవి కష్టాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాడు. నీకు నరకం అంటే ఏంటో చూపించారు కదా! ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు నాగ్‌. ఇంకేముందీ.. ఏది దొరికితే అది కలిపి వరుసగా నాలుగైదు గ్లాసుల డ్రింక్‌ తాగిపించి తనను అష్టకష్టాలు పెట్టిన షణ్ముఖ్‌ను ఓ ఆటాడుకున్నాడు రవి.

నచ్చినవి, నచ్చనవి అన్నీ కలిపి జ్యూస్‌ తయారు చేశాడు. ఆ జ్యూస్‌ను షణ్ను కళ్లు మూసుకుని తాగి అవస్థలు పడ్డాడు. తర్వాత శ్రీరామ్‌ తను ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నీని ఎంచుకున్నాడు. ఉల్లిపాయ తింటూ జ్యూస్‌ తాగమని శ్రీరామ్‌ చెప్పగా ఏదో జన్మలో నువ్వు నాకు మొగుడివయ్యుంటావన్నాడు సన్నీ. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇంకా ఎవరెవరు ఎలా పగ తీర్చుకున్నారో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement