లహరి ఎలిమినేట్‌, షాకైన యాంకర్‌ రవి! | Bigg Boss 5 Telugu: Anchor Ravi In Shocks For Lahari Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: లహరి ఎలిమినేషన్‌తో షాక్‌లో ఇంటిసభ్యులు

Published Sun, Sep 26 2021 6:29 PM | Last Updated on Sun, Sep 26 2021 6:29 PM

Bigg Boss 5 Telugu: Anchor Ravi In Shocks For Lahari Elimination - Sakshi

చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదంటారు! కానీ ఇది అన్నిచోట్లా వర్తించదు. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో! ఇక్కడ తప్పు చేసి తప్పించుకు తిరిగేవారుంటారు, తాము చేసిన తప్పులకు వేరొకరిని బలి చేసేవాళ్లూ ఉంటారు.. ఆ రకంగా చూస్తే ఈవారం యాంకర్‌ రవి, ప్రియ చేసిన తప్పిదాలకు లహరి శిక్ష అనుభవించేట్లు కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్‌లో ఆమె ఎలిమినేట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీకువీరులు సోషల్‌ మీడియాలో టముకేసి మరీ ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటూ తాజాగా ప్రోమో రిలీజైంది. ప్రియ, లహరి పేర్లు రాసి ఉన్న బల్బ్స్‌ పట్టుకున్న నాగ్‌ ఎవరికి గ్రీన్‌ లైట్‌ వస్తే వారు సేఫ్‌ అని పేర్కొన్నాడు. ఇలా చెప్పిన మరికాసేపటికే ప్రియ నమస్కరించడానికి అన్నట్లుగా చేతులు పైకెత్తినట్లు కనిపించడంతో ఆమె సేఫ్‌ అని తెలుస్తోంది. దీంతో లహరి ఎలిమినేట్‌ అయినట్లు స్పష్టమవుతోంది. ఇక లహరి ఎలిమినేషన్‌తో యాంకర్‌ రవి ఒక్కసారిగా షాక్‌ అయినట్లు చూపించారు. మరి హౌస్‌ను వీడేది లహరియేనా? కాదా? ఆమె ఎలిమినేషన్‌ హౌస్‌మేట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపనున్నది అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement