
Anchor Ravi In Bigg Boss 5 Telugu: యాంకర్ రవి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించిన రవి అనంతర కాలంలో యాంకరింగ్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో లాస్యతో కలిసి చేసిన సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ వీళ్లిద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ ఆన్‌స్క్రీన్ పెయిర్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. దీంతో ఈ జంట ఎన్నో ప్రోగ్రామ్‌లు చేయగా, తక్కువ కాలంలోనే రవి మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా పేరు గడించాడు. అయితే తర్వాత రవికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవగా.. వాటిని తట్టుకుని, ఎదిరించి ఇప్పటికీ యాంకర్‌గా రాణిస్తూ కోట్లాదిమందిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
యాంకరింగ్ అంటే ప్రాణం అని చెప్తున్న ఇతడు 2017లో ఇది మా ప్రేమకథ సినిమాతో హీరోగానూ లక్ పరీక్షించుకున్నాడు. ఈ సినిమా బెడిసికొట్టడంతో సినిమాలు పెద్దగా వర్కవుట్ కాదని గ్రహించి తిరిగి బుల్లితెర ద్వారానే జనాలను అలరిస్తున్నాడు. వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిరాక్ సహా పలు షోలకు యాంకరింగ్ చేశాడు. ఇతడికి భార్య నిత్య సక్సేనా, కూతురు వియా ఉంది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పంతొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి తనకు పెళ్లై 9 సంవత్సరాలైందని, దయచేసి ఇప్పుడా పెళ్లి విషయం మాత్రం తీయొద్దని నాగ్‌ను కోరాడు. మరి హౌస్‌లో అడుగు పెట్టిన ఈ యాంకర్ హౌస్‌లో ఎలా ఉంటాడు? ఎన్నిరోజులు ఉంటాడు అన్నది మున్ముందు చూడాల్సిందే!