Anchor Ravi Comments On Shannu Break Up Song: బిగ్‌బాస్ సీజన్-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా కొనసాగింది. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్‌బాస్ అగాధం సృష్టించింది. అయితే దాన్నుంచి సిరి-శ్రీహాన్ బయటపడితే, దీప్తి సునయన- షణ్నూల మధ్య మాత్రం బ్రేకప్ వ్యవహారం కొనసాగింది. ఈ షో అయిన వెంటనే న్యూ ఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్నూతో దీప్తి తెగదెంపులు చేసుకుంది.
తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్టార్‌మాలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో కలిసి ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనిలో షణ్నూ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అలరించాడు. ప్రస్తుతం తను ఉన్న సిచ్చువేషన్‌కి తగ్గట్లుగానే మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఎమోషన్‌తో డ్యాన్సులేశాడు.
అనంతరం హోస్ట్ యాంకర్ రవి మాట్లాడుతూ.. మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావ్ నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్ అంటూ అందరి ముందు ఇరికించేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలకు షణ్నూ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చాడన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment