Bigg Boss 5 Telugu, Anchor Ravi: బిగ్‌బాస్ షోకు వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న కొద్దిమందిలో యాంకర్ రవి ఒకరు. టాప్ యాంకర్‌గా రాణిస్తున్న రవి బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పంతొమ్మిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. హౌస్‌లోకి వచ్చీరావడంతోనే అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేశాడు. కానీ అది మిగతావాళ్లకు నెగెటివ్‌గా అనిపించింది. రవి కావాలని అన్నింట్లో తలదూర్చుతున్నాడని, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడంటూ నానామాటలు అన్నారు. మరికొన్ని గొడవల్లో అతడే నిందితుడిగా చీవాట్లు తిన్నాడు. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో మాత్రం రవి భార్య నిత్య, కూతురు వియా రావడంతో అతడిపై ఉన్న నెగెటివిటీ పోయి పాజిటివిటీ పెరిగింది. ఇక రవి టాప్ 3లో ఉంటాడనుకుంటున్న సమయంలో 12 వారంలో ఎలిమినేట్ అయ్యాడు.
అయితే బయటకు వచ్చిన రవి తనమీద, తన కుటుంబం మీద జరుగుతున్న ట్రోలింగ్‌ను చూసి తట్టుకోలేకపోయాడు. 24 గంటల్లో మీకు గంట మాత్రమే చూపిస్తారు, అక్కడేం జరుగుతుందో మీకు తెలీదు, నన్ను నెగెటివ్‌గా చూపించారు అని మొత్తుకుంటున్నా కొందరు నెటిజన్లు అతడిని విమర్శించడం మానుకోలేదు. తను సిరికి సపోర్ట్ చేయడాన్ని సహించలేకపోయిన కొందరు రవి కూతుర్ని కూడా మధ్యలోకి లాగారు. దీంతో ఓపిక నశించిన రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
'నువ్వు గర్వపడటానికి అది(సిరి) ఇండియాకి పతకం తీసుకురాలేదు. నానా పనులు చేసి టాప్ 5కి వచ్చింది. సిగ్గుందా? ఇంట్లో మా పిల్లలకు టీవీ చూపించాలంటేనే భయమేస్తోంది. నువ్వు ఉన్నప్పుడంతా అవతలోడికి ఎలా వెన్నుపోటు పొడవాలని ఉన్నావు.. బిగ్‌బాస్ హౌస్ బయటకు వచ్చాక ఈ రవినేనా చూసింది అనేలా నటిస్తున్నావు. ఆ షణ్ముఖ్‌ని తమ్ముడు అంటావ్.. సిగ్గుందా కొంచెమైనా? నువ్వు ఫ్రెండ్‌షిప్ పేరుతో ఇలానే చేస్తున్నవా? వియాకి ఇలాంటివి నేర్పిస్తావా? నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను' అంటూ ప్రియా రెడ్డి అనే యూజర్ మెసేజ్ చేసింది.
దీనిపై రవి కాస్త ఘాటుగానే స్పందించాడు. 'నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేడమ్. నా కూతురు గురించి ప్రస్తావించినందుకు మీపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పాడు ఇక మరో యూజర్ పంపిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి ఎందుకు ఇంత గలీజ్‌గా అయితున్నరు? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నుంచి సోషల్ మీడియాలో వచ్చే ఏ నెగెటివ్ కామెంట్‌ను సహించనని, అలాగే ఫేక్ అకౌంట్స్‌తో ఇష్టారీతిన కామెంట్లు చేసేవారిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు వదిలిపెట్టరని హెచ్చరించాడు. ఇప్పటిదాకా భరించింది చాలు.. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అసభ్యంగా కామెంట్లు చేసేవారికి శిక్ష పడేవరకు నేను పోరాడుతూనే ఉంటాను అని రవి స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment