
ప్రతీకాత్మక చిత్రం
ఓ మనిషిని చూడగానే అంచనా వేయటం చాలా కష్టం. ఎలాంటి సందర్భంలోనైనా ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా మనం ఎంచుకునే బంధాల విషయంలో. ప్రేమించిన కొత్తలో అద్భుతంగా కనిపించిన వ్యక్తి రోజులు గడుస్తున్న కొద్ది సైకోలా కనిపిస్తాడు. అతడి మాట, ప్రవర్తన అన్ని విషయాలు మనకు తేడాగా అనిపించటం మొదలుపెడతాయి. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమకాస్తా భయంగా మారి మన కంటికి అతడో సైకోలా అతడి చర్యలు కాని పనుల్లా తోస్తాయి. అర్థం చేసుకోవటంలో లోపమో లేక ఎదుటి వ్యక్తి మనతో ప్రవర్తిస్తున్న తీరు మంచిది కాదో తెలుసుకోవటం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. మీ పార్ట్‌నర్‌లో లేదా బంధంలో ఈ క్రింది లక్షణాలు ఉంటే వారితో మీరు కొంచె జాగ్రత్తగా ఉండండి.
- మీ మాటలకు, భావాలకు ఎదుటి వ్యక్తి విలువివ్వకపోవటం
- తరుచుగా అబద్ధాలు చెప్పటం
- ఎల్లప్పుడు అందరి దృష్టి అతడిమీదే ఉండాలనుకోవటం
- మీరేం చేస్తున్నారో తెలుసుకోవటానికి మీపై ప్రతి క్షణం ఓ కన్నేసి ఉంచటం
- తప్పు చేసినపుడు క్షమాపణలు చెప్పకపోవటం
- తరుచుగా జంతువులను హింసించటం
- క్షణంకో రకంగా మాట్లాడటం, గడియకో విధంగా ప్రవర్తించటం
- మీ మీద మీకే జాలి కలిగేలా చేయటం
- మీ పార్ట్‌నర్‌తో కలిసున్నా ఒంటరిగా ఫీల్ అవ్వటం
Comments
Please login to add a commentAdd a comment