
ప్రతీకాత్మక చిత్రం
రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు మనకు ఏదైనా బాధ కలిగితే బాగా దగ్గరైన వారితో పంచుకుంటే మనసుకు కొంత ప్రశాంతత కలుగుతుంది. వారు చూపించే సానుభూతి, సమస్యనుంచి బయటపడటానికి ఇచ్చే సలహాలు మనకు బోనస్ లాంటివి. అయితే మన బాధల్ని ఇతరులతో పంచుకోవటంలో కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఇతరులకు చెప్పుకోవటం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలాంటి విషయాలను మనం ఎదుటి వ్యక్తితో పంచుకోవచ్చు, ఎలాంటివి కూడదు.. ఎవరితో పంచుకోవాలి అన్న దానిపై ఓ అవగాహన ఉండటం తప్పనిసరి.
ఎదుటి వ్యక్తితో మన బంధంలోని బాధల్ని పంచుకునే ముందు అది ఎలాంటి బంధం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అది మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతోందన్నది కూడా ముఖ్యం. మన పార్ట్‌నర్‌తో చిన్న చిన్న స్పర్థలను, తరచుగా గొడవపడిన సంఘటనలను మీ సన్నిహిత మిత్రులు, సోదరి(వయసులో పెద్దవారు)తో పంచుకోవటం ఉత్తమం. రిలేషన్‌షిప్‌లోని పెద్దపెద్ద సమస్యలు, మానసిక, శారీరక, మోసాలకు సంబంధించిన విషయంలో సెకండ్ ఒపీనియన్ తప్పనిసరి. ఇలాంటి విషయాలను పక్కవారితో కాకుండా మీ పార్ట్‌నర్‌తో చర్చించటం మంచిది.
పార్ట్‌నర్ ప్రవర్తన కారణంగా తరచుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లయితే.. అది కూడా వారు క్షణికావేశంలో ఆ పనులు చేస్తున్నట్లు భావిస్తున్నట్లయితే ప్రొఫెసనల్ కౌన్సిలింగ్‌కు పార్ట్‌నర్‌ను తీసుకెళ్లండి. వారి సూచనల మేరకు మీ పార్ట్‌నర్‌తో బంధం కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయించుకోండి. ఇక బంధంలో నమ్మకానికి సంబంధించి పార్ట్‌నర్ అభిప్రాయాలకు విలువివ్వండి. చివరిగా మీ మనసుకు నచ్చింది మీరు చెయ్యండి.
Comments
Please login to add a commentAdd a comment