
స్నేహం, ప్రేమ, పెళ్లి.. ఈ మూడు బంధాలకు మనిషి జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలో ఎక్కువ భాగం ఈ బంధాలతో పెనవేసుకుని ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో ఈ బంధాలు తీపిని రుచిచూపిస్తే మరికొందరితో చేదు.. ఇలా ఒక్కోమనిషితో ఒక్కోరకమైన అనుభవాలు, అనుభూతులు కలుగుతుంటాయి. ఈ బంధాలు మనకు రెండు రూపాల్లో దగ్గరవుతాయి 1) సోల్‌మేట్ 2) లైఫ్ పార్టనర్. సోల్‌మేట్‌తో సాహచర్యం ఒకలా ఉంటే లైఫ్ పార్టనర్‌తో సాహచర్యం మరోలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాలు మన మీద చాలా ప్రభావం చూపుతాయి.
సోల్‌మేట్ : ఇదో ఆత్మ బంధం. ఇలాంటి వారు దొరకటం చాలా అరుదు. వీరితో జీవితం సంతోషంగా గడిచిపోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకోవటం వీరి లక్షణం. మనతో మనము కలిసి ఉన్నట్లుగా వీరి సాహచర్యం ఉంటుంది. మన సంతోషాలను రెట్టింపు చేస్తారు. కష్ట సమయాల్లో మన వెన్నంటే ఉండి ధైర్యం చెబుతారు. ఇటువంటి వారితో జీవితం ఎల్లప్పుడూ సాఫీగా సాగిపోతుంది. ఒక రకంగా ఇది పెద్దలు చెప్పిన జన్మజన్మల బంధంగా అనుకోవచ్చు. ఈ బంధం శాశ్వతం కాకపోవచ్చు. వీరి సాన్నిహిత్యంలో జీవితం కొన్ని కొత్త పాఠాలను నేర్చుకుంటుంది. మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే వీరు అర్థమవుతారు.
లైఫ్ పార్టనర్ : వీరి సాహచర్యాన్ని కంఫర్టబుల్‌గా ఫీలవుతాం. మన మనసును, భావాలను వీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పలేము. అయితే అన్ని విషయాలలో మన వెన్నంటే ఉంటారు. ఆడ,మగ విషయంలో అందానికి, ఆకర్షణలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. వీరితో బంధం అంత బలమైనదిగా ఉండకపోవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం జరుతుంది. వీరితో సుధీర్ఘమైన సంబంధాలను కలిగి ఉంటాము.
Comments
Please login to add a commentAdd a comment