
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన లవర్ ఎవరూ ప్రపంచానికి చాటిచెప్పాడు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సెర్బియా మోడల్ నటాషా స్టాన్‌తో తన రిలేషన్‌షిప్‌ను ఆఫీషియల్‌గా రివీల్ చేశాడు. ఈ మేరకు కొత్త సంవత్సరం సందర్భంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టాడు. నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ... ‘స్టార్టింగ్ ద ఇయర్ విత్ మై ఫైర్‌వర్క్’ అంటూ కామెంట్ చేశాడు.
ఇది నటాషా గురించి పాండ్యా మొదటి ఆఫీషియల్ స్టేట్‌మెంట్. ఆమెతో గత కొంతకాలంగా పాండ్యా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారని పెద్ద ఎత్తున రూమర్స్ షికార్లు చేశాయి. ఈ రూమర్లను కన్ఫర్మ్ హార్దిక్ కన్ఫర్మ్ చేశాడు. గతంలో చాలామంది అమ్మాయిలతో హార్దిక్ ఎఫైర్లు కొనసాగించాడు. అవి డేటింగ్ వరకే పరిమితమైనా నటాషాతో ప్రేమను మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. గత ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ హార్దిక్ పరిచయం కూడా చేశాడని కథనాలు వచ్చాయి. నటాషాను హార్దిక్ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడని, అందుకే వీరు చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్ ఖాన్, అనుష్క నటించిన ‘జీరో’ అనే మూవీలో నటాషా ఓ పాత్ర కూడా చేసింది. అన్నట్టు.. హిందీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నచ్ బలియే’లో పోటీపడుతోన్న నటాషాకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా హార్దిక్ గతంలో తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment