Rakul Preet Singh Talks About Her Wedding Plans With Jackky Bhagnani - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: 'అందుకే నా ప్రేమ విషయాన్ని బయటపెట్టాను'

Published Mon, Nov 22 2021 11:34 AM | Last Updated on Mon, Nov 22 2021 1:50 PM

Rakul Preet Singh Talks About Her Wedding Plans With Jackky Bhagnani - Sakshi

Rakul Preet Singh Talks About Her Wedding Plans With Jackky Bhagnani: స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవలె తను ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో కొంతకాలంగా సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తుంది. ఇటీవలె తన 31వ బర్త్‌డే సందర్భంగా తన రిలేషన్‌షిప్‌ గురించి రివీల్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఈమధ్య కాలంలో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం  “థాంక్స్ గాడ్” అనే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాకు నచ్చిన విషయాలు వినడానికి మాత్రమే ఇష్టపడతాను.

'నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు బయటపెట్టానంటే..అది ఓ అందమైన విషయం. అందరితో పంచుకోవాలనుకున్నా.పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. సో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు మీ అందరితో పంచుకుంటాను' అని పేర్కొంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement