
Shruti Haasan Clarity On Marraige :హీరోయిన్ శ్రుతి హాసన్ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కలిసి పార్టీలు, డిన్నర్ డేట్‌లకు వెళ్తూ ఈ జంట పలుసార్లు కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను శ్రుతి తరుచూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా వీరిద్దరి రిలేషన్, పెళ్లికి సంబంధించిన అంశాలపై శ్రుతి హాసన్ స్పందిస్తూ.. 'శాంతను నా బెస్ట్ ఫ్రెండ్. కళలు, సంగీతం పట్ల అతనికి అవగాహన ఉంది. మా ఇద్దరి అభిరుచులు ఒకటే. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతా. నాకు తనంటే ఎంతో గౌరవం ఉంది' అని పేర్కొంది.
ఇక పెళ్లి ప్రస్తావనపై మాట్లాడుతూ.. 'చాలా మంది నా పెళ్లి గురించి అడుతున్నారు. ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తా. కానీ ప్రస్తుతం నాకు పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన లేదు' అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. క్రాక్ సినిమాతో హిట్టు కొట్టిన శ్రుతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో తొలిసారి ఆమె ప్రభాస్‌తో జత కట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment