Shanthanu
-
టాటా వెన్నంటే ఉన్న ఈ కుర్రాడి గురించి తెలుసా..?
రతన్ టాటా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రియలిస్టుగా ఆయన గొప్పపేరు తెచ్చుకోవడమే కాదు, మానవతావాదిగా దేశప్రజల గుండెల్లో చోటు సంపాదించిన ఘనత ఆయన సొంతం. 86 ఏళ్ల రతన్‌టాటాకి చివరి వరకు అన్ని వేళల్లో సహాయకుడిగా తోడున్న వ్యక్తి శంతన్ నాయుడు(31). టాటా కుటుంబంతో ఎటువంటి సంబంధంలేని ఈయన రతన్ టాటాకి ఎలా చేరువయ్యాడో.. ఇద్దరికి కామన్‌గా ఉన్న అభిరుచేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.శంతన్ నాయుడు 1993లో పుణెలో జన్మించారు. పుణె యూనివర్సిటీ నుంచి 2014లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత టాటా గ్రూపులో డీజీఎం హోదాలో చేరారు. రతన్ టాటాకు మలి వయసులో ఈ యువ ఇంజినీర్ చేదోడు వాదోడుగా నిలిచారు.మూగజీవులకు సాయం చేసే గుణంఓ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి కనిపించింది. ఆ కుక్క మృతదేహం మీదుగానే వాహనాలు పోతుండడం గమనించాడు. ఈ దృశ్యం చూసి శంతన్ చలించిపోయాడు. వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.టాటాతో పరిచయం ఇలా..వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్’ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన రెగ్యులర్ పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.ఇదీ చదవండి: వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాదిచివరి వరకు తనతోనే..కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతన్ అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. ఎంబీఏ పూర్తయి తిరిగి వచ్చిన ఇండియా తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతన్‌ను పిలిపించుకున్న రతన్ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.ఒంటరితనం పోగొట్టేందుకు స్టార్టప్సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్‌టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్ నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్‌తోపాటు శంతన్ సెప్టెంబర్ 2022లో ‘గుడ్‌ఫెలోస్’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు. -
నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్
Shruthi Haasan About Relationship With Shanthanu Says He Is Amazing: 'గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఎందుకంటే నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్లో ఉన్నాను.' అని తెలిపింది శ్రుతి హాసన్. డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి రిలేషనల్‌లో ఉందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శంతను గురించి శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా అనుబంధం గురించి నేను కూడా దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్‌లో ఆ అనుబంధానిది చాలా పెద్ద భాగం. నేనెంతో కష్టపడి పని చేసి, ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఓ అద్భుతమైన పార్ట్నర్తో ఉంటాను. అందుకే నాకు దాచాలని అనిపించడంలేదు. మా ఇద్దరి ఈక్వేషన్ నాకు చాలా ఇష్టం' అని పేర్కొంది. చదవండి: స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్'.. -
పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్
Shruti Haasan Clarity On Marraige :హీరోయిన్ శ్రుతి హాసన్ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కలిసి పార్టీలు, డిన్నర్ డేట్లకు వెళ్తూ ఈ జంట పలుసార్లు కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను శ్రుతి తరుచూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా వీరిద్దరి రిలేషన్, పెళ్లికి సంబంధించిన అంశాలపై శ్రుతి హాసన్ స్పందిస్తూ.. 'శాంతను నా బెస్ట్ ఫ్రెండ్. కళలు, సంగీతం పట్ల అతనికి అవగాహన ఉంది. మా ఇద్దరి అభిరుచులు ఒకటే. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతా. నాకు తనంటే ఎంతో గౌరవం ఉంది' అని పేర్కొంది. ఇక పెళ్లి ప్రస్తావనపై మాట్లాడుతూ.. 'చాలా మంది నా పెళ్లి గురించి అడుతున్నారు. ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తా. కానీ ప్రస్తుతం నాకు పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన లేదు' అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. క్రాక్ సినిమాతో హిట్టు కొట్టిన శ్రుతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో తొలిసారి ఆమె ప్రభాస్‌తో జత కట్టనుంది. చదవండి : నితిన్ మాస్ట్రో మూవీ ఇంట్రెస్టింగ్ వీడియో -
శాంతనుకు జంటగా పార్వతినాయర్
యువ నటుడు శాంతనుకు జంటగా నటి పార్వతీనాయర్ నటించనున్నారు. సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ కొడుకు శాంతను అన్న విషయం తెలిసిందే. ఈయన కథానాయకుడిగా పలు చిత్రాలలో నటించారు. ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి వాయ్‌మై అనే చిత్రంలోనూ నటించారు. అయినా హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని అందుకోలేకపోయారు. కాగా కె.భాగ్యరాజ్ శిష్యులలో ఒకరు పార్తీపన్. దర్శకుడిగా, కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను చేసిన పార్తీపన్ కథై, తిరైకథై వచనం, ఇయక్కం చిత్రం తరువాత దర్శకుడు మరో చిత్రం చేయలేదు. చాలా గ్యాప్ తరువాత తాజాగా కొడిట్ట ఇడంగలై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గురువు వారసుడు శాంతనుని కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇక కథానాయకిగా చాలా మందిని పరిశీలించిన పార్తీపన్ చివరికి నటి పార్వతినాయర్ను ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రంలో కొత్త నటిని నాయకిగా పరిచయం చేయాలని భావించినా పార్వతినాయర్ తన కథలోని నాయకి పాత్రకు చక్కగా నప్పుతారని ఆమెను ఎంపిక చేసినట్లు పార్తీపన్ స్పష్టం చేశారు. ఇక నటుడు శాంతనును హీరోగా ఎంపిక చేయడంపై వివరిస్తూ శాంతను విజయం కోసం చాలా సిన్సియర్‌గా కృషి చేస్తున్నారన్నారు.అయినా ఎందుకనో అది ఆయనకు దూరం అవుతూనే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే శాంతను విజయం వెనుక తాను ఉండాలని భావించానన్నారు. గురువుకి శిష్యుడిగా అది తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా బ్లాంక్లను పూర్తి చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పార్తీపన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిందన్నది గమనార్హం. -
షూటింగ్లో యవ హీరోకు గాయాలు
చెన్న: నటుడు శాంతనుకు షూటింగ్లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. -
ఘనంగా నటుడు శాంతను, కీర్తీల వివాహం
-
ఘనంగా శాంతను, కీర్తీల వివాహం
తమిళసినిమా; నటుడు శాంతను కీర్తిల వివాహం శుక్రవారం నగరంలో వేడుకగా జరిగింది.సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్, పూర్ణిమ దంపతుల కొడుకు, యువ నటుడు శాంతను, బుల్లితెర వ్యాఖ్యాత కీర్తీల వివాహం చెన్నై సమీపంలోని సముద్రతీర ప్రాంతంలో గల ఇస్కాన్ దేవాలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరువర్గాల బంధు మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రి పొన్రాధాక్రిష్ణన్, డీఎంకే మాజీ మంత్రి ఆర్కాడు వీరాసామి, ఐజేకే పార్టీ అధ్యక్షుడు పచ్చముత్తు,తదితర రాజకీయ నాయకులతో పాటు నటుడు విజయ్, పార్తిబన్, కార్తీ, విశాల్, దర్శకుడు హరి, నటుడు విజయకుమార్, నటి జ్యోతిక తదితర చిత్రప్రముఖులు వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రముఖ నటులు వెంకటేశ్, నరేశ్, మణి రత్నం, సుహాసిని, రేవతి, సుకన్య, ప్రభు హాజరయ్యారు. సాయంత్రం చెన్నై మానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపంలో వీరి వివాహ రిసెప్షన్ జరిగింది. -
పునర్నిర్మాణానికి ఆ రెండు చిత్రాలు
గతంలో విజయం సాధించిన చిత్రాలు పునర్ నిర్మాణం ఆ మధ్య జోరుగా సాగి ఆగిపోయింది. తిల్లుముల్లు చిత్రంతో ఆగిన ఆ ట్రెండ్ త్వరలో మళ్లీ మొదలు కానుంది. ఇంతకుముందు కె.భాగ్యరాజా హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం డార్లింగ్ డార్లింగ్. పూర్ణిమ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సుమన్ ముఖ్యపాత్ర పోషించారు. 1982లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. చిత్రంలోని పాటలన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. ఆ చిత్రం రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. భాగ్యరాజ పాత్రలో ఆయన తనయుడు శాంతను నటించనున్నారు. నిర్మాత షణ్ముగరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆయనే రీమేక్ చేయనున్నారు. హీరోయిన్ ఎవరన్నది నిర్ణయం కాని ఈ చిత్రానికి అదియమాన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా 1994లో తెరపైకొచ్చి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇందు. నటుడు ప్రభుదేవా, అప్పటి క్రేజీ హీరోయిన్ రోజా జంటగా నటించిన ఈ చిత్రానికి పవిత్రన్ దర్శకుడు. అలాంటి చిత్రం తాజాగా మరోసారి తెరకెక్కడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు ప్రజాదరణ పొందితే మరిన్ని తెరకెక్కే అవకాశం ఉంటుంది.