
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ టాప్5 కంటెస్టెంట్లు రాకేత్ బాపత్, షమితా శెట్టి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నారు. హౌస్‌లో ఇద్దరి మధ్యా నడిచిన ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ సీజన్ గ్రాండ్‌గా ముగిసింది. అయితే షో అయిపోయిన తర్వాత కూడా వీరు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఇటీవలె ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌కు సైతం వెళ్లారు. ఈ సందర్భంగా యూ అండ్ ఐ అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసుకున్నారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్
ఇదిలా ఉండగా బిగ్‌బాస్ షో అనంతరం తన మాజీ భార్య రిధితో మాట్లాడానని, షమితాతో నా రిలేషన్‌ని ఆమె స్వాగతించిందని తెలిపాడు. 'నా బిగ్‌బాస్ జర్నీ పట్ల రిధికి కూడా నచ్చింది. అంతేకాకుండా నేనే షమితాతో ఉండటం చూసి ఆమె సంతోషించింది. అంతేకాకుండా ఒకవేళ రిధి ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. మేం ఇద్దరం ఎంతో మెచ్యూర్‌గా ఆలోచిస్తాం. భార్యభర్తలుగా విడిపోయినా ఇప్పటికీ మేం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం' అని పేర్కొన్నారు. కాగా ఏడేళ్ల వివాహ బంధం అనంతరం రాకేశ్ రిధి దంపతులు విడాకులు తీసుకున్నారు. చదవండి :సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment