సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. తన కోచ్ మరియన్ వాజ్దాతో ఉన్న 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంలో అతని పాత్ర మరువలేనిది. దాదాపు 15 ఏళ్ల పాటు టెన్నిస్‌లో రారాజుగా వెలిగిన జొకోవిచ్ వెనకాల మరియన్ వాజ్దా కృషి ఉందంటే అతిశయోక్తి కాదు. గతేడాది ట్యురిన్ వేదికగా జరిగిన ఏటీపీ టూర్ వరల్డ్ ఫైనల్స్ సందర్భంగా జొకోవిచ్.. మరియన్‌తో బంధం ముగుస్తున్నట్లు పేర్కొన్నాడు. తాజాగా జొకోవిచ్ పర్సనల్ వెబ్‌సైట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. కష్టాల్లో తన వెన్నంటి నిలిచిన మరిమన్‌కు జొకోవిచ్ ఘనమైన వీడ్కోలు పలుకుతూ వెబ్‌సైట్‌లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు.
చదవండి: Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్
''నా కెరీర్‌లో కోచ్‌గా మరియన్ వాజ్దా పాత్ర మరువలేనిది. 15 సంవత్సరాల మా బంధంలో అతను చూపెట్టిన స్నేహం, అంకితభావానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. నేను సాధించిన అద్భుత విజయాలలో అతను భాగస్వామిగా ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు మా బంధానికి ముగింపు పలకడం బాధిస్తున్నా తప్పని పరిస్థితి. మరియన్ కేవలం వృత్తిపరంగానే నాకు దూరమవుతున్నాడు.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నాకు.. నా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నా. ఈ 15 ఏళ్లలో అతను నాకు చేసిన సహాయాన్ని కృతజ్ఞతతో సరిపెట్టుకోలేను.. అంతకుమించి ఏదైనా చేయాలి'' అంటూ రాసుకొచ్చాడు.
జొకోవిచ్ సందేశానికి ముగ్దుడైన మరియన్ వాజ్దా స్పందిస్తూ.. '' జొకోవిచ్.. వృతిపరంగా మాత్రమే నీకు దూరమవుతున్నా. కోర్టు లోపల.. బయట నీకు ఎప్పుడు నా మద్దతు ఉంటుంది. ఈ 15 ఏళ్ల మన బంధంలో ఎన్నో మధురానుభూతులు సంపాదించుకున్నా. మనిద్దరం కలిసి వెనుకకు తిరిగి చూస్తే అద్భుతమైన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలకు నేను కృతజ్ఞతుడిని. కొత్త సవాళ్ల కోసం ఎప్పుడు ఎదురుచూస్తూనే ఉంటా.'' అంటూ తెలిపాడు.
కాగా జొకొవిచ్ ఇటీవలే తన నెంబర్‌వన్ ర్యాంక్‌ను రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు కోల్పోయాడు. దాదాపు 361 వారాల పాటు జొకోవిచ్ నెంబర్‌వన్‌గా కొనసాగాడు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఎంత చెప్పినా తన పట్టు వదలని జొకోవిచ్.. కోర్టు మెట్లు ఎక్కినప్పటికి నిరాశే ఎదురైంది. మూడు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం జొకోవిచ్‌పై వేటు వేసింది. ఇక 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ ప్రస్తుతం రోజర్ ఫెదరర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. జొకో ఖాతాలో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆరు వింబుల్డన్, మూడు యూఎస్ ఓపెన్, రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్
Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment