హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు 31వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ రోజు(అక్టోబర్ 10) ఆమె బర్త్‌డే సందర్భంగా ఓ కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కొంత కాలంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమాయాణం నడిపిన రకుల్ తాజాగా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రకుల్ త్వరలోనే జాకీని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే తమ రిలేషన్‌షిప్ ఆఫీషియల్ చేసిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే..
మరోవైపు జాకీ భగ్నానీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ రకుల్ బర్త్‌డే విషెస్ చెబుతూ రకుల్‌పై తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో వీరికి కృతి సనమ్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ ఆయుష్మాన్ ఖురానాతో పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో అసలు ఈ జాకీ భగ్నానీ ఎవరని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ మేరకు జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. అతడు కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించాడు.
చదవండి: నాకు మళ్లీ కరోనా:ప్రగ్యా జైస్వాల్
పూజా ఎంటర్టైన్‌మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ సినిమాలు నిర్మిస్తున్నారు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ మూవీతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. 2016లో సరబ్జిత్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారాడు. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్, రణ్ దీప్ హుడా కీలక పాత్రల్లో నటించారు. కాగా త్వరలో జాకీ భగ్నానీ అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మించనున్నాడు. కాగా జాకీ భగ్నాని కూడా రకుల్ లాగే ఫిట్‌నెస్ ఫ్రీక్ అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment