ఇటీవల ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కులు తమ కంటూ ఓ గుర్తింపు, గౌరవంతో సమాజంలో మెలగాలని గట్టిగా ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వంపై దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిందే ఈ ఈ లావెండర్ వివాహం. సామాజిక అంచనాలకు అనుగుణంగా లేదా ఆయా వ్యక్తిగత లైంగిక సామర్థ్యాన్ని దాచిపెడతాయి ఈ వివాహాలు. వారికి సమాజం నుంచి వచ్చే కళంకం నివారించేందుకు వచ్చిన ఓ గొప్ప మార్గం ఇది.
ఇక్కడ లావెండర్ అనే పదం. చారిత్రాత్మకంగా స్వలింగ సంపర్కానికి సంబంధించిన రంగును సూచిస్తుంది. స్వలింగ సంపర్కులకు సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా నావిగేట్ చేసేలా భిన్న లింగ వివాహంలోకి ప్రవేశించేలా మార్గాన్ని సులభతరం చేసేదే ఈ 'లావెండర్ వివాహం'. దీన్నే యువత ఎంచుకోవడానికి గల కారణాలేంటంటే..?
సామాజిక అంగీకారం, అంచనాలు..
స్వలింగ సంపర్కుల హక్కులకు గుర్తింపులేని సమాజం నుంచి సానుకూల స్పందన లభించేలా ఈ వివాహాలను ఎంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల కుటుంబ అంచనాలను, వారి వృత్తిని, సామాజిక స్థితిని కాపాడుకునేందుకు వచ్చినవే ఈ లావెంబర్ వివాహాలు.
చట్టపరమైన ఆర్థిక ప్రయోజనాలు..
సాధారణంగా వివాహంలో ఉండే పన్ను మినహాయింపులు, వారసత్వ హక్కులు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు వంటివి ఈ లావెండర్ వివాహలో కూడా లభిస్తాయి. అయితే ఇక్కడ జంటలు తమ భాగస్వామి లైంగిక ధోరణని రహస్యంగా ఉంచడం వల్లే ఈ బెనిఫిట్స్‌ని క్లైయిమ్ చేసుకోగలుగుతారు.
సాంస్కృతిక, మతపరమైన ఒత్తిళ్లు
సాధారణంగా సాంస్కృతిక లేదా మతపరమైన నిబంధనలు కారణంగా సమాజం నుంచి ఎదురయ్యే బహిష్కరణ తదితరాల నుంచి బయటపడేలా భిన్న లింగ సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే లావెండర్ వివాహాల్లోకి ప్రవేశిస్తున్నారు పలువురు.
వ్యక్తిగత భద్రత
స్వలింగ సంపర్కులు వివక్ష, హింస లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి ఈ లావెండర్ వివాహాల్లో వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దీని వల్ల ఆయా జంటలకు గట్టి భద్రత లభించినట్లు అవుతుంది. చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులకు సంబంధించి..వారి నిజమైన లైంగిక గుర్తింపును కప్పిపుచ్చడం ద్వారా వారు వ్యక్తిగత భద్రతతో ఉన్నట్లు భావించగలుగుతారు. వారు ఇతర జంటల మాదిరిగా స్వేచ్ఛగా మనగలుగుతారు. అందుకే ఇటీవల ఈ వివాహాలకు ప్రాధాన్యత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..)
Comments
Please login to add a commentAdd a comment