Lavender Colour
-
'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్..?
ఇటీవల ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కులు తమ కంటూ ఓ గుర్తింపు, గౌరవంతో సమాజంలో మెలగాలని గట్టిగా ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వంపై దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిందే ఈ ఈ లావెండర్ వివాహం. సామాజిక అంచనాలకు అనుగుణంగా లేదా ఆయా వ్యక్తిగత లైంగిక సామర్థ్యాన్ని దాచిపెడతాయి ఈ వివాహాలు. వారికి సమాజం నుంచి వచ్చే కళంకం నివారించేందుకు వచ్చిన ఓ గొప్ప మార్గం ఇది.ఇక్కడ లావెండర్ అనే పదం. చారిత్రాత్మకంగా స్వలింగ సంపర్కానికి సంబంధించిన రంగును సూచిస్తుంది. స్వలింగ సంపర్కులకు సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా నావిగేట్ చేసేలా భిన్న లింగ వివాహంలోకి ప్రవేశించేలా మార్గాన్ని సులభతరం చేసేదే ఈ 'లావెండర్ వివాహం'. దీన్నే యువత ఎంచుకోవడానికి గల కారణాలేంటంటే..?సామాజిక అంగీకారం, అంచనాలు..స్వలింగ సంపర్కుల హక్కులకు గుర్తింపులేని సమాజం నుంచి సానుకూల స్పందన లభించేలా ఈ వివాహాలను ఎంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల కుటుంబ అంచనాలను, వారి వృత్తిని, సామాజిక స్థితిని కాపాడుకునేందుకు వచ్చినవే ఈ లావెంబర్ వివాహాలు.చట్టపరమైన ఆర్థిక ప్రయోజనాలు.. సాధారణంగా వివాహంలో ఉండే పన్ను మినహాయింపులు, వారసత్వ హక్కులు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు వంటివి ఈ లావెండర్ వివాహలో కూడా లభిస్తాయి. అయితే ఇక్కడ జంటలు తమ భాగస్వామి లైంగిక ధోరణని రహస్యంగా ఉంచడం వల్లే ఈ బెనిఫిట్స్‌ని క్లైయిమ్ చేసుకోగలుగుతారు. సాంస్కృతిక, మతపరమైన ఒత్తిళ్లుసాధారణంగా సాంస్కృతిక లేదా మతపరమైన నిబంధనలు కారణంగా సమాజం నుంచి ఎదురయ్యే బహిష్కరణ తదితరాల నుంచి బయటపడేలా భిన్న లింగ సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే లావెండర్ వివాహాల్లోకి ప్రవేశిస్తున్నారు పలువురు.వ్యక్తిగత భద్రతస్వలింగ సంపర్కులు వివక్ష, హింస లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి ఈ లావెండర్ వివాహాల్లో వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దీని వల్ల ఆయా జంటలకు గట్టి భద్రత లభించినట్లు అవుతుంది. చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులకు సంబంధించి..వారి నిజమైన లైంగిక గుర్తింపును కప్పిపుచ్చడం ద్వారా వారు వ్యక్తిగత భద్రతతో ఉన్నట్లు భావించగలుగుతారు. వారు ఇతర జంటల మాదిరిగా స్వేచ్ఛగా మనగలుగుతారు. అందుకే ఇటీవల ఈ వివాహాలకు ప్రాధాన్యత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..) -
Lavender : అద్భుతమైన ప్రయోజనాలు
వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా, గోధుమ గడ్డి, లావెండర్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. లావెండర్ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేకాదు లావెండర్ ఆయిల్, పువ్వుల వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్ మొక్క, దాని వాసన మనకు మాత్రం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా. లావెండర్ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆయిల్ ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పనిచేస్తుంది. -
గోటి తలుపులు...
నెయిల్ ఆర్ట్ ఈ నెయిల్ ఆర్ట్ చూడటానికి ఎంత స్టైల్‌గా ఉంటుందో... వేసుకోవడానికీ అంతే సులువుగా ఉంటుంది. ఈ డిజైన్ చూడటానికి తెరిచిన ఉన్న డోర్లలా కనిపిస్తాయి. ఈ ఆర్ట్‌ను మీరూ వేసుకోవాలంటే... ముందుగా లావెండర్ (లేత వంకాయ రంగు), తెలుపు లేదా నెయిల్ కలర్ పాలిష్‌లు, ఫొటోల్లో కనిపిస్తున్న హోల్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేబుల్స్ (షాపుల్లో దొరుకుతాయి), ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్‌ను సిద్ధం చేసుకోవాలి. అంతే.. వీటితో కింద చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే మీ గోళ్లు అందంగా మారతాయి. 1. ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, అందంగా కత్తిరించుకోవాలి. ఆపైన వాటిపై లావెండర్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి. 2. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు హోల్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేబుల్స్‌ను గోరుకు రెండు వైపులా పెట్టి, మధ్యభాగంలో వైట్ లేదా నెయిల్ కలర్ పాలిష్‌ను అప్లై చేయాలి. 3. ఒకదాని తర్వాత మరో గోరుపై ముందు స్టెప్‌లో చెప్పిన విధంగా చేసుకుంటూ పోవాలి. 4. అన్ని గోళ్లపై పాలిష్ పూర్తిగా ఆరిన తర్వాత ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో బేస్‌కోట్ వేయాలి. దాంతో మీ గోళ్లు మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి.