ఇస్లామిక్ స్టేట్ మరో దారుణానికి తెగబడింది. సిరియాలో 'గే'లు అన్న పేరుతో తొమ్మిది మంది పురుషులను, ఒక బాలుడిని హతమార్చింది. వీళ్లందరినీ హోమ్స్ రాష్ట్రంలోని రస్తాన్ అనే పట్టణంలో హోమోసెక్సువల్స్ అనే పేరుతో వీరిని కాల్చి చంపినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. మరో ఇద్దరు పురుషులు, ఒక బాలుడిని హ్రైటన్ అనే పట్టణంలో ఇదే కారణంతో చంపేశారని చెప్పింది.
ఈ అందరినీ బహిరంగంగానే చంపేశారని, అయితే ఎక్కడా ఎవరూ వీటిని చిత్రీకరించకుండా ముందే అక్కడున్న కెమెరాలను ధ్వంసం చేశారని అంటున్నారు. స్వలింగ సంపర్కం, చేతబడి, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు విశ్వాసులుగా ఉండటం.. ఇవన్నీ ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మరణశిక్షకు అర్హమైన నేరాలు. గతంలో కొంతమంది స్వలింగ సంపర్కులను మేడ మీద నుంచి కిందకు తోసేసి చంపేశారు.
స్వలింగ సంపర్కులని.. పదిమంది కాల్చివేత
Published Tue, Sep 22 2015 8:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM
Advertisement
Advertisement