బొట్టు, దుప్పట్టతో ట్రాన్స్‌జెండర్‌లా గంభీర్‌.! | Gautam Gambhir Was Spotted Wearing A Dupatta And Bindi | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 14 2018 3:38 PM | Last Updated on Fri, Sep 14 2018 7:45 PM

Gautam Gambhir Was Spotted Wearing A Dupatta And Bindi - Sakshi

వైరల్‌గా మారిన గంభీర్‌ ఫొటోలు

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ పెద్దబొట్టు, దుప్పట్ట కొంగుతో ట్రాన్స్‌జెండర్‌లా కనిపించాడు. గతకొంత కాలంగా అతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ ఢిల్లీ ఆటగాడు.. దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతవారం స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్స్‌ కమిటీ నిర్వహించిన హిజ్రా హబ్బా వేడుకలకు గంభీర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మగవారు బొట్టు, దుప్పట్ట, ఆడవారు మీసాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే గంభీర్‌ దుప్పట్ట, బొట్టు ధరించాడు. అతనికి ట్రాన్స్‌జెండర్స్‌ సాయం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక గంభీర్‌ ట్రాన్స్‌జెండర్స్‌కు మద్దతుగా ఉండటం ఇదే తొలిసారేం కాదు. రక్షాబంధన్‌ సందర్భంగా వారితో రాఖీ కట్టించుకుని వారిని గౌరవించాలని పిలుపునిచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement