మరోసారి తెరపైకి ఎల్జీబీటీ
న్యూఢిల్లీ: మరోసారి ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్) వివాదం తెరపైకి వచ్చింది. భారత పీనల్ కోడ్ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది.
స్వలింగ సంపర్కం అంశంపై నిషేధం విధించాలా లేక కొనసాగించాలా అనే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిటిషన్ దారుకు తెలియజేశారు. దీంతో అసలు విచారణకే రాదనకున్న తమ పిటిషన్పై చాలాకాలం తర్వాత కదలిక రావడంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం వెల్లివిరిసి సంబరాలకు సిద్ధమయ్యారు.