Chief Justice TS Thakur
-
నేను కూడా కెప్టెన్‌నే: చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు క్రికెట్ జట్టుకు తాను కూడా కెప్టెన్‌నేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. అనురాగ్ ఠాకూర్‌కు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండేందుకు అర్హతలు ఉన్నాయంటూ చెప్పుకోడానికి బీసీసీఐ ప్రయత్నించినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ ఆఫీసు బేరర్లుగా ఉండాలంటే అర్హత ఏంటని ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత అధ్యక్షుడు రాజకీయ నాయకుడా అని నిలదీసింది. దీనికి బీసీసీఐ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమాధానమిస్తూ.. ఠాకూర్ కూడా క్రికెటరేనని చెప్పారు. దాంతో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న గోపాల్ సుబ్రమణియం లేచి.. మనమంతా క్రికెట్ ఆడినవాళ్లమే కదా అన్నారు. దానికి సిబల్ అభ్యంతరం వ్యక్తం చేసి, ఠాకూర్ సీరియస్ క్రికెటర్ అని చెప్పారు. ఆ సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. తాను సుప్రీంకోర్టు జడ్జీలకు కెప్టెన్ అని చెప్పారు. అయితే, అనురాగ్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ఆడారని, హిమాచల్ ప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారని తెలిపారు. అయితే, ఆతర్వాత బిహార్ క్రికెట్ అసోసియేషన్ కూడా దీనిపై వ్యాఖ్యానించింది. అనురాగ్ ఠాకూర్ కేవలం ఒకే ఒక్క రంజీ మ్యాచ్ ఆడారని, అందులో హిమాచల్ ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జమ్ము కశ్మీర్ జట్టుపై ఆడారని తెలిపింది. కేవలం క్రికెట్ బోర్డులలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆడి ఉంటారని ఎద్దేవా చేసింది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. తాను కూడా చిన్న రాష్ట్రం నుంచే వచ్చానన్నారు. హిమాచల్ ప్రదేశ్ జట్టు తన రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ లాంటి చిన్న రాష్ట్రాలతోను, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌తోను ఆడుతుందేమోనని అన్నారు. -
కశ్మీర్ నుంచి కేసులు బదిలీ చేయొచ్చు
సుప్రీం కోర్టు సంచలన తీర్పు న్యూఢిల్లీ: వైవాహిక సంబంధ వివాదాలతోపాటు సివిల్, క్రిమినల్ కేసులను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికిగానీ, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకుగానీ బదిలీ చేసే అధికారం తనకుందంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పౌర శిక్షాస్మృతి (సీపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) లాంటి కేంద్ర చట్టాలు ఆ రాష్ట్రానికి వర్తించనప్పటికీ న్యాయం పొందాలన్న కక్షిదారుల హక్కును పరిరక్షించడానికి కేసులను బదిలీ చేసే అసాధారణ అధికారం తమకుందని స్పష్టంచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆయా కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉందని పేర్కొంది. ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు హక్కున్నట్లు స్థానిక చట్టాలైన జమ్మూకశ్మీర్ సీపీసీ, జమ్మూకశ్మీర్ సీఆర్పీసీల్లో లేదని ఆ రాష్ట్రం వాదించింది. జమ్మూకశ్మీర్‌లోని కోర్టులో తనకు న్యాయం జరగలేదని భావించి ఎవరైనా తమ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరినప్పుడు ఆ కోర్టు దాన్ని తిరస్కరిస్తే.. అప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం బదిలీకి ఆదేశించే అసాధారణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని పేర్కొంది. సందర్భానుసారంగా అధికరణాలు 32, 136, 142 ప్రకారం కేంద్ర సీపీసీ, సీఆర్పీసీలతో నిమిత్తం లేకుండా కేసుల బదిలీకి ఆదేశించే అధికారముంటుందని చెప్పింది. దీనికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. కశ్మీర్ స్వాతంత్య్రానికి హఫీజ్ సయీద్ యాత్ర లాహోర్: ముంబై దాడుల సూత్ర ధారి జమాతె ఉద్ దవా స్థాపకుడు హఫీజ్ సయీద్ మంగళవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు ‘కశ్మీర్ సద్భావన యాత్ర’ ప్రారంభించాడు. యాత్రను జమ్మూ కశ్మీర్‌కూ పొడిగిస్తామని ప్రతినబూనాడు. మంగళవారం సాయంత్ర ం ఇక్కడ ప్రారంభమైన యాత్ర బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకుంటుంది. -
‘న్యాయవాద’ సంస్కరణలు జరగాలి: సుప్రీం
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో పెద్ద ఎత్తున సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని సుప్రీమ్‌కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలోని కోర్టుల్లో ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా న్యాయవాదులు ఉన్నారని, ఈ సంఖ్య అవసరమైన దానికంటే ఎక్కువేనని పేర్కొంది. కీలకమైన న్యాయ పరిపాలనలోకి లాయర్లు సులువుగా ప్రవేశించగలిగే పద్ధతిలో ఇకనైనా మార్పు తేవాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు సూచించింది. లాయర్లు ఆలిండియా బార్ ఎగ్జామినేషన్(ఏఐబీఈ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటూ 2010లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. -
మరోసారి తెరపైకి ఎల్జీబీటీ
న్యూఢిల్లీ: మరోసారి ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్) వివాదం తెరపైకి వచ్చింది. భారత పీనల్ కోడ్ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. స్వలింగ సంపర్కం అంశంపై నిషేధం విధించాలా లేక కొనసాగించాలా అనే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిటిషన్ దారుకు తెలియజేశారు. దీంతో అసలు విచారణకే రాదనకున్న తమ పిటిషన్‌పై చాలాకాలం తర్వాత కదలిక రావడంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం వెల్లివిరిసి సంబరాలకు సిద్ధమయ్యారు. -
'బస్సులో వెళ్లేందుకైనా అభ్యంతరం లేదు'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్నినివారించడంలో సహకరించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే కోర్టుకు బస్సులో వెళ్లేందుకు తనకు అభ్యంతరమేమి లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. వాయు కాలుష్య నివారణకు జనవరి 1 నుంచి ఢిల్లీ ప్రభుత్వం అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ప్రణాళికకు ఆయన మద్దతు తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం సరి-బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను దినం తప్పించి దినం రోడ్ల మీదకు అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో మోతిలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న తన నివాసం నుంచి నడుచుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకైనా, లేదా బస్సులో వెళ్లేందుకైనా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ సహచర న్యాయమూర్తులతో కలిసి కార్లను పంచుకుంటే.. ఈ విషయంలో సామాన్య ప్రజలకు కూడా సందేశం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన చెప్పారు. కోర్టుకు వెళ్లేందుకు 'నడుచుకుంటూ వెళ్తాం లేదా బస్సు ఎక్కుతాం' అని ఆయన పేర్కొన్నారు. తమ పథకానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో జస్టిస్ టీఎస్ ఠాకూర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీఆల్ కృతజ్ఞతలు తెలిపారు.