‘న్యాయవాద’ సంస్కరణలు జరగాలి: సుప్రీం
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో పెద్ద ఎత్తున సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని సుప్రీమ్‌కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలోని కోర్టుల్లో ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా న్యాయవాదులు ఉన్నారని, ఈ సంఖ్య అవసరమైన దానికంటే ఎక్కువేనని పేర్కొంది. కీలకమైన న్యాయ పరిపాలనలోకి లాయర్లు సులువుగా ప్రవేశించగలిగే పద్ధతిలో ఇకనైనా మార్పు తేవాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు సూచించింది. లాయర్లు ఆలిండియా బార్ ఎగ్జామినేషన్(ఏఐబీఈ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటూ 2010లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.