ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం | Man Killed Hes Relative When Rejects Homosexuality | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం

Published Tue, Feb 5 2019 11:24 AM | Last Updated on Tue, Feb 5 2019 2:19 PM

Man Killed Hes Relative When Rejects Homosexuality - Sakshi

స్వలింగ సంపర్కానికి నిరాకరించిన అత్తకొడుకును యువకుడు హత్య చేసిన సంఘటన

సేలం: స్వలింగ సంపర్కానికి నిరాకరించిన అత్తకొడుకును యువకుడు హత్య చేసిన సంఘటన ఆదివారం సేలంలో చోటుచేసుకుంది. వివరాలు.. సేలం సమీపంలోని అమ్మాపేట ప్రాంతానికి చెందిన రమేష్‌ (40) ఆటోడ్రైవర్‌. ఇతని భార్య విజయలక్ష్మి. వీరి కుమార్తె ప్రియంకా, కుమారుడు ఆర్ముగం (15) ఉన్నారు. కాగా, ఆర్ముగం స్వల్ప మానసిక బాధితుడు కావడంతో ఐదో తరగతి వరకు చదువుకున్నాడు.
తర్వాత పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆర్ముగం ఆదివారం సాయంత్రం అమ్మా పేట పోలీసు స్టేషన్‌ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన విద్యార్థులు సమాచారాన్ని ఆర్ముగం తల్లిదండ్రులకు, అమ్మాపేట పోలీసు స్టేషన్‌కు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు ఆర్ముగంను సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్ముగంను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

అమ్మాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారం జరిపిన విచారణలో విస్తుపోయే విషయం వెల్లడైంది. ఆర్ముగం అత్త కొడుకు భరత్‌ (19) సేలంలో ఉన్న ఒక ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. భరత్‌కు ఆర్ముగం స్వలింగ సంపర్క సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇటీవల ఈ సంబంధానికి ఆర్ముగం నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో భరత్‌ ఆదివారం ఆర్ముగంని సంఘటన స్థలానికి రప్పించాడు. అక్కడ భరత్‌ బలవంత చేయగా ఆర్ముగం నిరాకరించడాని, దీంతో ఆగ్రహం చెందిన భరత్‌ తన వద్ద ఉన్న కత్తితో భరత్‌ గొంతు కోసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు భరత్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement