
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మండ్య(కర్ణాటక) : 17 సంవత్సరాల మైనర్ బాలునితో స్వలింగ సంపర్కం పెట్టుకుని, బాలుడు మర్మాంగం కోసుకునేలా చేసిన కిరాతకున్ని శ్రీరంగపట్టణం పోలీసులు అరెస్టు చేశారు. దుండగుడు మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకాలోని సీతాపుర గ్రామానికి చెందిన సునీల్‌కుమార్ (28). బాలునికి మాయమాటలు చెప్పి ఇతడు అసహజ వాంఛలు తీర్చుకుంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే
వివరాలు.. సీతాపురకు చెందిన సునీల్‌కుమార్ ఏడాదిన్నరగా బాలున్ని లొంగదీసుకున్నాడు. అతనితో ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడటం, గ్రామంలో ఉన్న దేవాలయంలో ప్రతి శుక్రవారం కలవడం చేసేవారు. తనకు దేవుడు పూనుతాడని, చెప్పినట్లు చేయాలని బాలున్ని తన వశంలోకి తెచ్చుకున్నాడు. తాను చేసేది ఎవరికీ చెప్పవద్దని, చెబితే దేవుడు చంపేస్తాడని బెదిరించాడు. నేను దేవుడని నిన్ను ఇష్టపడుతున్నానని, నాతో ఉండు, నిన్ను నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పి చివరికి మర్మాంగం కోసుకునేలా ప్రేరేపించాడు. ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున తాలూకాలోని హరవు ఎల్లెకెరె రోడ్డులో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి కత్తిరించుకునేలా చేశాడు. అనంతరం గాయపడిన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. అస్పత్రిలో డాక్టర్లకు విషయం చెప్పవద్దని, కారులో డ్రాప్ అడిగి వస్తుంటే ఎవరో దుండగులు ఇలా చేసి పారిపోయారని చెప్పాలని సూచించాడు.
అనుమానంతో ఫిర్యాదు
ఆస్పత్రిలో చేర్చగా, అనుమానం వచ్చిన వైద్యులు శ్రీరంగపట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలున్ని విచారించగా, విషయం మొత్తం బాలుడు వివరించాడు. దీంతో పోలీసులే నివ్వెరపోయారు. చివరకు కామాంధుడు సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment