
సాక్షి, తిరుమల: సంక్రాంతి తర్వాత ‘సేవ్ టెంపుల్స్’ పేరుతో పాదయాత్ర చేపడుతున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని.. ఇలాంటి దేవస్థానంలో హిందూయేతరులు ఉండటం మంచి పద్ధతి కాదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హిందూ ఆలయాల్లో సమస్యలను తెలియజేస్తామని పరిపూర్ణానంద పేర్కొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్
తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి అనుగుణంగా తాను కూడా సీఏఏకి మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. సీఏఏపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉన్న హిందువులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఇతర దేశాలలో ఉన్న హిందువులు భారత దేశానికి వస్తే..వారికి పౌరసత్వం ఇవ్వడం సిఏఏ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment