బ్రిటన్‌ హిందువుల ఆరోగ్యం భేష్‌ ! | Hindus among healthiest, Sikhs most likely to own homes | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ హిందువుల ఆరోగ్యం భేష్‌ !

Published Mon, Mar 27 2023 5:28 AM | Last Updated on Mon, Mar 27 2023 5:28 AM

Hindus among healthiest, Sikhs most likely to own homes - Sakshi

లండన్‌: ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అంటారు. దానికి తగ్గట్టుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హిందువులకి మించిన వారు లేరని బ్రిటన్‌లోని ఒక సర్వేలో తేలింది. బ్రిటన్‌లో నివసించే హిందువులు అత్యంత ఆరోగ్యవంతులు , విద్యాధికులని తేలితే, సిక్కులందరికీ దాదాపుగా సొంతిల్లు ఉందని వెల్లడైంది. ఇంగ్లండ్, వేల్స్‌లోని జనగణన సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  యూకేలో ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టేటస్టిక్స్‌ (ఒఎన్‌ఎస్‌) ఈ జనగణన వివరాలను విడుదల చేసింది.

‘‘2021లో మార్చిలో జరిపిన ఈ సర్వేలో హిందువుల్లో ఆరోగ్యంగా ఉన్నవారు 87.8% ఉంటే, మొత్తంగా జనాభాలో 82%మంది ఆరోగ్యంతో ఉన్నారు. ఇక ఉన్నత విద్యనభ్యసించిన హిందువులు 54.8% ఉంటే, మొత్తం బ్రిటన్‌ జనాభాలో 33.8% ఉన్నారు. ఇక సిక్కుల్లో 77.7% మంది సొంతిళ్లలో నివసిస్తున్నారు.ఉద్యోగాల్లేక అవస్తలు పడుతున్న వారిలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న 16–64 ఏళ్ల మధ్య వయసున్న ముస్లింలలో 51% మందే ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని సర్వే నివేదిక వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement