ముస్లింలు రాముని వారసులే: రాందేవ్‌ | Lord Ram ancestor of Hindus as well as Muslims says Baba Ramdev | Sakshi
Sakshi News home page

ముస్లింలు రాముని వారసులే: రాందేవ్‌

Published Sat, Feb 9 2019 2:39 AM | Last Updated on Sat, Feb 9 2019 5:30 AM

Lord Ram ancestor of Hindus as well as Muslims says Baba Ramdev - Sakshi

అహ్మదాబాద్‌: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు ముస్లింలకు కూడా పూర్వీకుడేనని యోగా గురువు బాబా రాందేవ్‌  అన్నారు. శుక్రవారం ఖేడా జిల్లా నడియడ్‌లోని యోగ శిబిరంలో రాందేవ్‌ మాట్లాడారు.  ‘అయోధ్యలో రామ మందిరం నిర్మాణం నిర్మించాలని గట్టిగా కోరుతున్నా. అయోధ్యలో కాకుంటే మరెక్కడ నిర్మించాలి? దానిని మక్కా, మదీనా లేదా వాటికన్‌ సిటీలో నిర్మించలేము’ అని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘హిందువులకు మాత్రమే కాదు, శ్రీరాముడు ముస్లింలకూ పూర్వీకుడే. రామాలయ నిర్మాణం జాతికి గర్వ కారణమైన విషయం’ అని పేర్కొన్నారు. రాందేవ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement