దాడులపై ట్రంప్ జోక్యం చేసుకోవాలి
వైట్ హౌస్ ఎదుట భారత–అమెరికన్ల ర్యాలీ
వాషింగ్టన్: భారత సంతతికి చెందినవారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు.. అమెరికాలో ఇస్లామోఫోబియా (ముస్లింలంటే భయం), గ్జినోఫో బియా (విదేశీయులంటే భయం) బాధితులవుతున్నారని, విద్వేషపు దాడు లకు బలవుతున్నారని అక్కడి భారత–అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకో వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైట్‌హౌస్ ఎదుట శాంతియుత ప్రదర్శన నిర్వహించారు.
వర్జీనియాకు చెందిన కార్పొరేట్ న్యాయవాది వింధ్య అడప మాట్లాడుతూ.. అమెరికాలో విద్వేషపు దాడులకు హిందువులు బలవుతున్నారని, అక్కడి భారత సమాజాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. ద్వేషపూరిత నేరాలపై భారత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.