బైడెన్, హారిస్‌పై ట్రంప్ ధ్వజం
బంగ్లాలో మైనారిటీలపై హింసకు ఖండన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారిద్దరూ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై హింసను తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అనాగరికమైన చర్యగా పేర్కొన్నారు. ట్రంప్ తన దీపావళి సందేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హిందూ అమెరికన్లకు రక్షణ కలి్పస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై అరాచక మూకల దాడులను, వారి ఆస్తులను దోచుకుంటున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండించారు. ఎక్స్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. తాను అధ్యక్షునిగా ఉంటే ఇలా ఎప్పటికీ జరిగేది కాదన్నారు. ఇజ్రాయెల్ మొదలుకుని ఉక్రెయిన్ మీదుగా అమెరికా దక్షిణ సరిహద్దు దాకా బైడెన్, హారిస్ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ ధ్వజమెత్తారు. మునుపటి కంటే మెరుగైన అమెరికాను తీర్చిదిద్దుతా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment