
ప్రత్యేక పూజలు చేస్తున్న మఠాధిపతి యోగానంద సరస్వతి
ఎదులాపురం(ఆదిలాబాద్) : శ్రీరామనవమి పురస్కరించుకుని హిందూవాహిని ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర ఆధ్యంతం కన్నుల పండువగా సాగింది. యువకుల నృత్యాలు, భజనలు, శ్రీరామ సంకీర్తనలతో పట్టణం మారుమోగింది. వినాయక్‌చౌక్‌లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి శోభాయాత్రను మఠాధిపతి యోగానంద సరస్వతి పూజలు నిర్వహించి ప్రారంభించారు. యాత్ర నేతాజీచౌక్, అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, దేవీచంద్ చౌక్‌ల మీదుగా అశోక్ రోడ్ నుంచి తిరిగి మఠానికి చేరుకుంది. అంతకు ముందు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహారెడ్డి శోభాయాత్రను పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాయలశంకర్, సుహాసినీరెడ్డి, భార్గవ్‌దేశ్‌పాండే, అన్ని హిందూ సమాజ్ ప్రతినిధులు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment