అమెరికాలో హిందువుల విజయం | US Hindus claim victory in California | Sakshi

అమెరికాలో హిందువుల విజయం

Nov 12 2017 12:03 PM | Updated on Apr 4 2019 3:25 PM

US Hindus claim victory in California - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని హిందూ బృందాలు కాలిఫోర్నియా కేసులో కీలక విజయాన్ని సాధించాయి. అమెరికాలోని పాఠ్యాంశాల్లో భారతదేశం, హిందూమతం గురించి ఖచ్చితమైన, విశాల దృక్ఫథంతో, శాస్త్రీయంగా ఇవ్వాలని హిందూ వర్గాలు చేస్తున్న పదేళ్ల పోరాటం ఫలించింది. హిందుత్వం, భారతదేశం గురించి అమెరికా పాఠ్యాంశాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కాలిఫోర్నియా ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌బీఈ) అంగీకారం తెలిపింది.

రెండు పాఠ్యాంశాల పద్దతిని సైతం కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తిరస్కరించింది. అంటే గ్రేడ్స్‌ కే6-గ్రేడ్స్‌ 6-8 వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ హిందువులు, భారత దేశ చరిత్రను సమగ్రంగా అందించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అమెరికా హిందూ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు శాంతారామ్‌ అన్నారు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ నాగరికత, హిందుత్వం గురించిన నిజానిజాలు అమెరికన్లకు తెలుస్తాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement