వైట్ హౌస్కు భారత్ బెస్ట్ ఫ్రెండ్
వైట్ హౌస్కు భారత్ బెస్ట్ ఫ్రెండ్
Published Sat, Dec 17 2016 2:19 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇండియన్-అమెరిన్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన విజయానికి కృషిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ఎన్నికల్లో అనూహ్య భరితంగా విజయం సాధించడంతో కీలక రాష్ట్రాలైన ఓర్లాండ్, ఫ్లోరిడాలో ట్రంప్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హిందూ కమ్యూనిటీ హాజరైంది. తన విజయోత్సవ ప్రచారంలో పాల్గొనందుకు హిందూవులను గొప్పగా ట్రంప్ కొనియాడారు. మొదటిసారి ట్రంప్ తన విజయోత్సవంలో హిందూ కమ్యూనిటీ, ఇండియన్-అమెరికన్లు చేసిన కృషిని మెచ్చుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. ''వారందరూ ఎక్కడున్నారు. వారికి నేను థ్యాంక్సూ చెప్పాలి. మీరు నాకు ఓటు వేయడం అమేజింగ్'' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆర్థికసంస్కరణలను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు. భారత్-అమెరికా సంబంధాలను మంచిగా కొనసాగించేందుకు కృషిచేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. వైట్హౌస్కు భారత్ బెస్ట్ ఫ్రెండ్ కాబోతుందని పేర్కొన్నారు. ''పెద్ద, సాహసోపేతమైన కలను కనండి. మిమ్మల్ని మీరు నమ్మండి. అమెరికాను నమ్మండి.. అందరం కలిసి అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిదుద్దాం... అంటూ ట్రంప్ ఇండియన్ అమెరికన్లకు పిలుపునిచ్చారు. సర్వే అంచనాల ప్రకారం 60 శాతం కంటే ఎక్కువమంది ఈ సారి ట్రంప్కు ఓటేసినట్టు రిపబ్లికన్ హిందూ కొలిషన్ చైర్మన్ చెప్పారు
Advertisement
Advertisement