ఎండాకాలం పోయింది. వర్షాలు మెదలయ్యాయి. చల్లగా ఉంటుందిలే అనుకుంటే గుజరాత్‌లోని వడోదర నగర వాసులకు ‘కొత్త’ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. అంతేనా.. శనివారం కాస్త వర్షాలు తగ్గి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఉపిరి పీల్చుకుంటున్న నగర వాసులకు మొసళ్ల రూపంలో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వరదలతో పాటే నగరంలోకి కొట్టుకొచ్చిన మొసళ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుండటంతో భయంతో వణికిపోతున్నారు. ఎక్కడి నుంచి మొసలి వచ్చి దాడి చేస్తుందేమనని భయపడి ఇళ్లలోనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.