అమరావతికి తూచ్.. వడోదరకు రైల్వే వర్సిటీ | railway university goes to vadodara instead of amaravathi | Sakshi

అమరావతికి తూచ్.. వడోదరకు రైల్వే వర్సిటీ

Published Thu, Feb 25 2016 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

అమరావతికి తూచ్.. వడోదరకు రైల్వే వర్సిటీ

అమరావతికి తూచ్.. వడోదరకు రైల్వే వర్సిటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఓ వరం ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఓ వరం ప్రకటించారు. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. ఈ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నగరానికి కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే రైల్వే మంత్రికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తులు చేశారు. పరిశీలిస్తామని చెప్పినా.. చివరకు ప్రధాని సొంత రాష్ట్రానికే దాన్ని తరలించుకుపోయారు.

ఇక దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న రైల్వే ఆటో హబ్‌ను తమిళనాడు రాజధాని చెన్నైకి కేటాయించారు. ఇది ఏంటన్న విషయమై ఇంకా వివరణ మాత్రం రాలేదు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరుగుతుండటంతో ఆ రాష్ట్రానికి ఇది వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement