వడోదరలో మోడీపై పోటీకి ఢీ అంటున్నఓ సామాన్య నేత! | Narendra Ravat to contest from vadodara | Sakshi
Sakshi News home page

వడోదరలో మోడీపై పోటీకి ఢీ అంటున్నఓ సామాన్య నేత!

Published Thu, Mar 20 2014 10:07 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

Narendra Ravat to contest from vadodara

అహ్మదాబాద్: ఒకవైపు రాజకీయాల్లో కాకలు తీరిన నేత... మరొక వైపు రాజకీయాల గురించి పెద్దగా తెలియని ఓ సామాన్య నేత. వీరిద్దరి మధ్య పోరుకు గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానం వేదిక కానుంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానంలో... పట్టణ కాంగ్రెస్ నేత నరేంద్రరావత్ తలపడనున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆచరణలోకి తెచ్చిన కొత్త విధానం ద్వారా రావత్‌ను పార్టీ ఎంపిక చేసింది. రావత్ వత్తిరీత్యా ఇంజనీర్. మహారాజ సయాజీరావు యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగానూ ఉన్నారు. అయితే, ఇంతకుముందు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం ఆయనకు లేదు.

 

దీంతో మోడీ గెలుపు నల్లేరుపై నడక కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మోడీ పోటీచేయనున్న విషయం తెలిసిందే. రెండో స్థానంగా మోడీ సొంత రాష్ట్రంలోని సురక్షిత స్థానమైన వడోదరను ఎంచుకున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement