నరేంద్ర మోడీకి మరో మోడీ బెడద! | Another Modi contest in Vadodara | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీకి మరో మోడీ బెడద!

Published Thu, Apr 10 2014 8:43 PM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

నరేంద్ర మోడీ - Sakshi

నరేంద్ర మోడీ

 వడోదర: ఎన్నికలలో చిత్రవిచిత్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అదే పేరు గల వారిని పోటీకి పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అదే పేరు గల వారు పోటీ చేస్తూ ఉంటారు.  బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కూడా ఇలాంటి ఓ  చిక్కు వచ్చి పడింది. గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానంలో మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  వారిలో నరేంద్రమోడీ కాకుండా మరో మోడీ కూడా పోటీలో ఉన్నారు.

నరేంద్ర బాబూ లాల్ మోడీ అనే వ్యాపారవేత్త వడోదరలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కొంతమంది ఓటర్లు పేర్లను చూసి తికమక పడి ఆ మోడీకి వేయబోయి ఈ మోడీకి వేసే అవకాశం ఉంది. తన పేరులోనూ నరేంద్ర మోడీ ఉన్నందున కలసి వస్తుందని ఈ నరేంద్ర బాబూ లాల్ మోడీ అనుకున్నారేమో!  ఈ మోడీకి  అసలు మోడీ ఓట్ల ఎన్ని కొల్లగొడతారో తెలియాలంటే ఫలితాల వరకూ వేచిచూడవలసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement