సాక్షి, అహ్మదాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలూ భక్తిని ప్రద్శరిస్తూనే తమదైన టచ్ ఇస్తూ ఈ మధ్య కొందరు విగ్రహాలను పెట్టేస్తున్నారు. బాహుబలి లాంటి క్రేజీ చిత్రాల దగ్గరి నుంచి పాపులర్ వ్యక్తులను కూడా విగ్రహాల్లోకి లాగేస్తూ సమ్‌థింగ్ స్పెషల్‌ను చూపిస్తున్నారు.
గణేషుడ్ని మోస్తూ చైనాతో వార్‌కు సై
Published Fri, Sep 1 2017 10:35 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
సాక్షి, అహ్మదాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలూ భక్తిని ప్రద్శరిస్తూనే తమదైన టచ్ ఇస్తూ ఈ మధ్య కొందరు విగ్రహాలను పెట్టేస్తున్నారు. బాహుబలి లాంటి క్రేజీ చిత్రాల దగ్గరి నుంచి పాపులర్ వ్యక్తులను కూడా విగ్రహాల్లోకి లాగేస్తూ సమ్‌థింగ్ స్పెషల్‌ను చూపిస్తున్నారు.
వడోదరలోని జుని గడి వినాయక మండపంలోని విగ్రహం కూడా ఇలాంటి కోవలోనిదే. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ భుజాన వినాయకుడితో ఏర్పాటు చేసిన విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పక్కనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రతిమను కూడా చేర్చారు.
చైనా పై దాడికి సిద్ధం అంటూ పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం గమనించవచ్చు. ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఈ మండపాన్ని రూపొందిచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుందనే చెప‍్పొచ్చు.
Advertisement