సాక్షి, విజయవాడ: గుజరాత్‌లోని వడోదరలో పోలీస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను గురువారం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పోలీసుల పనితీరును ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నేటి నుంచి నవంబర్ 6 వరుకు కొనసాగనుంది. ఏపీ పోలీస్ స్టాల్ అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో.. ఏపీ స్టాల్ వద్ద ప్రత్యేక పోలీస్ విధానంపై ప్రధాని మోదీ ఆసక్తి కనబరిచారు.
అంతేకాక రాష్ట్ర పోలీసుశాఖలో అమలు చేస్తున్న స్పందన, వీక్లీఆఫ్ సిస్టమ్ వివరాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ల పనితీరును ప్రశంసిస్తూ వాటిని పూర్తి స్థాయిలో అమలుచేసి వివరాలు అందజేయాలని ప్రధాని మోదీ పోలీసుశాఖను కోరారు. కాగా స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, ఫేస్ రికగ్నైజేషన్, ఈ విజిట్, డీజీ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వివరించే టేబుల్స్‌ను స్టాల్‌లో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment