
హవ్వా.. ఆయనా ఓ డాక్టరేనా..!
వడోదర: గుజరాత్లో ఓ వైద్యుడు ఆ వృత్తికి అపవాదు తెచ్చాడు. ఏడేళ్ల బాలికకు పశువులకు వేసే ముందులు ఇయ్యడంతో వాటిని ఉపయోగించి ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు లోనైంది. సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన ఆ వైద్యుడిపై ఆ బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వడోదరలోని బాపోడ్ లోగల వాగోదియా రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రికి విభా చంద్వాని అనే ఏడేళ్ల బాలికను జగదీశ్ షా అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది.
తన కూతురు తలలో ఎక్కువగా పేలు ఉన్నాయని, ఆ సమస్యతో తీవ్రంగా బాధపడుతుందని వైద్యం చేయాలని చెప్పింది. దీంతో ఆ వైద్యుడు ఆ పాపకు పిప్జెట్ హెచ్ సిరప్ తోపాటు ఓ లోషన్ ను నుదురుపై రాయాలని మందుల చీటిలో రాశాడు. వాటిని ఉపయోగించిన ఆ బాలిక తీవ్ర తలనొప్పి వాంతులుతో అనారోగ్యానికి లోనవ్వగా సకాలంలో వైద్యం చేయించారు. ఆ మందులు పరిశీలించగా అవి పశువులకు ఇచ్చేవని తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై చర్యలు తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.