4 లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం | narendra modi wins by 4 lakh votes in vadodara | Sakshi
Sakshi News home page

4 లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం

Published Fri, May 16 2014 11:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

4 లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం - Sakshi

4 లక్షల ఓట్లతో వడోదరలో మోడీ విజయం

తన కంచుకోట వడోదర లోక్సభ స్థానంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీ పై ఆయనకు 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 326 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, యూపీఏ కూటమి 65 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇతరులు 152 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ గాంధీనగర్ స్థానంలో ఘన విజయం సాధించారు. తొలుత ఆయన అక్కడినుంచి పోటీ చేయడానికి విముఖత కనబరిచినా, గుజరాత్ కావడంతో మోడీ స్వయంగా ఆయన విజయబాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నట్లు తెలిసింది.

కేవలం బీజేపీ ఒక్కటే 265 స్థానాలలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. కర్ణాటకలో లింగాయత్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ మళ్లీ తన పాత వైభవాన్ని కనబరుస్తోంది. లింగాయత్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరడంతో ఈ ఆధిక్యం వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement