Vadodara Chemical Factory Boiler Blast గుజరాత్: వడోదర ఇండస్ట్రియల్ జోన్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బాయిలర్‌లో శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు జరిగిన పేలుడులో నాలుగేళ్ల బాలిక, 65 ఏళ్ల వృద్ధుడు సహా నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, గాయాలైన తల్లి (30)తోపాటు గాయపడిన వారినందరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారి సాజిద్ బలోచ్ వెల్లడించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల గోడలు కూలడమేకాక, 1.5 కిలోమీటర్ల మేర ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఐతే ఘటనలో మృతి చెందినవారు, గాయపడిన వ్యక్తులు ఫ్యాక్టరీ కార్మికులు, ప్రయాణికులుగా గుర్తించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారుచేసే కాంటన్ లేబొరేటరీస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గుజరాత్‌లో ఎనిమిది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. డిసెంబర్ 16న పంచమహల్ జిల్లాలో ఇదే తరహాలో ఫ్యాక్టరీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు!
Comments
Please login to add a commentAdd a comment